https://oktelugu.com/

‘వ‌కీల్ సాబ్’ 11 రోజుల కలెక్ష‌న్స్ః లాభం ఎంత?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘వ‌కీల్ సాబ్’గా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. ఈ దెబ్బ‌కు బాక్సాఫీస్ మోత మోగిపోయింది. ఏపీలో థియేటర్లకు ప్ర‌తికూల‌త‌లు ఎదురైన‌ప్ప‌టికీ.. రికార్డు స్థాయిలో వ‌సూళ్లు సాధించిందీ చిత్రం. తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబ‌ట్టిన సినిమా.. మొద‌టి వారం దాటిన త‌ర్వాత కూడా జోరు కొన‌సాగించింది. ఉగాది వ‌ర‌కూ ప‌వ‌ర్ స్టార్ ప్ర‌భంజ‌నం ఓ రేంజ్ లో కొన‌సాగింది. అటు.. ఓవ‌ర్సీస్ లోనూ వ‌కీల్ సాబ్ స‌త్తాచాటాడు. భారీ ఓపెనింగ్స్ దూసుకెళ్లిందీ […]

Written By:
  • Rocky
  • , Updated On : April 19, 2021 / 03:25 PM IST
    Follow us on


    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘వ‌కీల్ సాబ్’గా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. ఈ దెబ్బ‌కు బాక్సాఫీస్ మోత మోగిపోయింది. ఏపీలో థియేటర్లకు ప్ర‌తికూల‌త‌లు ఎదురైన‌ప్ప‌టికీ.. రికార్డు స్థాయిలో వ‌సూళ్లు సాధించిందీ చిత్రం. తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబ‌ట్టిన సినిమా.. మొద‌టి వారం దాటిన త‌ర్వాత కూడా జోరు కొన‌సాగించింది. ఉగాది వ‌ర‌కూ ప‌వ‌ర్ స్టార్ ప్ర‌భంజ‌నం ఓ రేంజ్ లో కొన‌సాగింది.

    అటు.. ఓవ‌ర్సీస్ లోనూ వ‌కీల్ సాబ్ స‌త్తాచాటాడు. భారీ ఓపెనింగ్స్ దూసుకెళ్లిందీ సినిమా. లాక్ డౌన్ త‌ర్వాత విడుద‌లైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా క‌లెక్ష‌న్లు సాధిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే.. ఓవర్సీస్ లో 1 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉందంటున్నారు.

    అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపించింద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారీ వ‌సూళ్లు రాబ‌ట్టే ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా అడ్డుకుంద‌ని చెబుతున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా వ‌సూళ్లు క్షీణించాయ‌ని స‌మాచారం.

    కాగా.. వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల‌పై మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌ట్లేదు. కార‌ణాలు ఏంట‌న్న‌ది తెలియ‌దుగానీ.. వారు సినిమాకు సంబంధించిన లెక్క‌లు బ‌య‌ట పెట్ట‌ట్లేదు. దీంతో.. ట్రేడ్ వర్గాలు కలెక్షన్ల వివరాలు బయటపెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో.. ఏరియాల వారీగా 11వ రోజు క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

    వకీల్ సాబ్ మొదటి వారం కలెక్షన్లు: 100.1 కోట్లకు చేరువయ్యాయి. 8వ రోజు 1.75 కోట్లు, 9వ రోజు 2.10 కోట్లు, 10వ రోజు 2.38 కోట్లు కలెక్షన్లు సాధించింది ఈ సినిమా.. ఇక 11 వరోజు సోమవారం మధ్యాహ్నం వరకు 1 కోటి రూపాయలు వసూలయ్యాయి.

    మొత్తం 11వ రోజు వరకు వకీల్ సాబ్ మొత్తం కలెక్షన్లు రూ.107.33 కోట్లకు చేరుకున్నాయి.

    నైజాంః 23.15 కోట్లు
    సీడెడ్ః 12.15 కోట్లు
    వైజాగ్ః 11 కోట్లు
    తూర్పుః 5.85 కోట్లు
    వెస్ట్ః 6.83 కోట్లు
    కృష్ణః 4.68 కోట్లు
    గుంటూరుః 6.78 కోట్లు
    నెల్లూరుః 3.16 కోట్లు
    రెస్ట్ ఆఫ్ ఇండియా 3.54 కోట్లు
    వ‌ర‌ల్డ్ గ్రాస్ః 129.6 కోట్లు
    వ‌ర‌ల్డ్ షేర్ః 107.33 కోట్లు