Vaishnav Tej- Rashmi: యాంకర్ రష్మీ గౌతమ్ కి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ గా ఉంటారని తేలిపోయింది. ఈ గ్లామరస్ బ్యూటీ వలలో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ పడిపోయాడు. ఆ అవకాశం వస్తే ఆమెతోనే చేస్తా అంటున్నాడు. తాజాగా వైష్ణవ్ యాంకర్ రష్మీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఉప్పెనతో గొప్ప ఆరంభం అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. స్టార్ హీరో రేంజ్ వసూళ్లు అందుకున్న ఉప్పెన ఆయనకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, హీరోయిన్ కృతి శెట్టి సైతం ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. 2021లో విడుదలైన ఉప్పెన నిర్మాతలతో పాటు బయ్యర్ల జేబులు నింపింది.

డెబ్యూ చిత్రంతో భారీ హిట్ కొట్టిన వైష్ణవ్ కి వరుస ప్లాప్స్ షాక్ ఇచ్చాయి. రెండో చిత్రం కొండపొలం డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ కనీస ఆదరణ దక్కించుకోవడంలో విఫలం చెందింది. ఇక లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా అంతకు మించిన డిజాస్టర్ అయ్యింది. రంగ రంగ వైభవంగా ఫుల్ రన్ కలెక్షన్స్ ఉప్పెన ఫస్ట్ డే కలెక్షన్స్ లో సగం కూడా లేకపోవడం విశేషం. దర్శకుడు గిరీశాయ పాత చింతకాయ పచ్చడి లాంటి కథను అంతే దారుణమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు.
రంగ రంగ వైభవంగా అవుట్ డేటెడ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులు తేల్చేశారు. దీంతో కనీసం ఓపెనింగ్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. సబ్జెక్స్ ఎంపిక విషయంలో తడబడుతున్న వైష్ణవ్ తేజ్ పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఈ యంగ్ హీరో మంచి హిట్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.కాగా వైష్ణవ్ ఐటెం సాంగ్ చేయాల్సి వస్తే యాంకర్ రష్మీ గౌతమ్ తో చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు.

మీరు ఐటెం సాంగ్ చేయాల్సి వస్తే హీరోయిన్ గా ఎవరిని ఎంచుకుంటారు? అని అడగ్గా వైష్ణవ్ యాంకర్ రష్మీ పేరు చెప్పాడు. రష్మీ ముఖంలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ బాగా పలుకుతాయి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో ఐటెం సాంగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నా పక్కన ఐటెం భామగా రష్మీ గౌతమ్ అయితే బాగుంటుందని వైష్ణవ్ మనసులో మాట బయటపెట్టాడు. దీంతో రష్మీ మామూలు అమ్మాయి కాదు సైలెంట్ గా మెగా హీరోకి వల వేసింది. అతని మనసును దోచేసిందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక దశలో వరుసగా చిత్రాలు చేసిన రష్మీకి ఆఫర్స్ తగ్గాయి.