https://oktelugu.com/

Vaishnav Tej, Krish movie Konda Polam: ‘కొండపొలం’లో రకుల్ తో వైష్ణవ్.. లుక్ బాగుంది !

Vaishnav Tej Konda Polam: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే ఒక నవల ఆధారంగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ముందే అనుకున్నట్లుగానే టైటిల్‌ ను ‘కొండపొలం’గా ఖారారు చేశారు. ప్రస్తుతం ఈ మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2021 / 12:36 PM IST
    Follow us on

    Vaishnav Tej Konda Polam: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే ఒక నవల ఆధారంగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ముందే అనుకున్నట్లుగానే టైటిల్‌ ను ‘కొండపొలం’గా ఖారారు చేశారు. ప్రస్తుతం ఈ మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

    ముఖ్యంగా వైష్ణవ్‌ తేజ్‌ గడ్డం లుక్ చాలా బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిన్నపాటి వీడియో సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఎలాగూ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 78 కోట్లు కలెక్ట్ చేశాడు వైష్ణవ్‌ తేజ్. అందుకే, వైష్ణవ్‌ తేజ్‌ కి స్టార్ డమ్ రాకపోయినా, మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే అతనికి రెండో సినిమా అయినా, ఏభై కోట్లు వరకు మార్కెట్ అయింది.

    అయితే, ఈ సినిమా గురించి సినీ జనాల్లో కాస్త నెగిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా బాగా రాలేదు అనేది ఇన్ సైడ్ టాక్. అందుకే, క్రిష్ సినిమాలో చాలా భాగాన్ని రీషూట్ చేశాడట. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చారు. మరి ఆ కారణాల్లో ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా ఒక కారణమా అనేది తెలియాల్సి ఉంది.

    ఈ చిత్రం అయితే పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. కథ చాలా సహజంగా ఉంటుందట. అందుకే, సినిమా బాగా స్లో నేరేషన్ లో సాగుతుందట. పైగా కథలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. ఉన్న ఆ పాత్రలు కూడా పూర్తిగా కమర్షియల్ అంశాలకు దూరంగా సాగేవి. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

    ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు.