Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh trailer release date: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ విడుదల తేదీ...

Ustaad Bhagat Singh trailer release date: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..3 డైలాగ్స్ లీక్..ఫ్యాన్స్ కి పండగే!

Ustaad Bhagat Singh trailer release date: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం సరిగ్గా మరో నెల రోజుల్లో, అనగా మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘దేఖ్లేంగే సాలా’ పాట విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రెండవ పాట ‘#TheAuraOfUstaad’ ని ఈనెల 22 వ తారీఖున విడుదల చేయబోతున్నారు. ఈ పాటని పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉంటుందట. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ పాట ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించాడు. ఈ నెల 22 న హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారట. ఈ పాట తర్వాత నేరుగా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. మార్చి 10 లోపు ట్రైలర్ ఉంటుందని సమాచారం. ఈ ట్రైలర్ కట్ ని చాలా క్రిస్పీ గా, పవర్ ఫుల్ డైలాగ్స్ తో నింపేసాడాట డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటికే రెండు గ్లింప్స్ వీడియోస్ ని విడుదల చేశారు. ఈ రెండు వీడియోస్ లోని డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మొదటి గ్లింప్స్ లో ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతాది’ అనే డైలాగ్, అదే విధంగా రెండవ గ్లింప్స్ లో ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’, ‘కచ్చితంగా గుర్తు పెట్టుకో..గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం..కనిపించని సైన్యం ‘ అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అదే విధంగా గ్లాస్ డైలాగ్ కి ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. ఇలా అవుట్ డేటెడ్ డైలాగ్స్ కాకుండా గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ డైలాగ్స్ పెట్టొచ్చు కదా అని కొంతమంది అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. అభిమానుల ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న హరీష్ శంకర్, వాళ్ళ కోరికకి తగ్గట్టుగానే డైలాగ్స్ ని ట్రైలర్ లో పెట్టబోతున్నారట. మూడు డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఉంటాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం కూడా ఫిక్స్ అయిపోయింది. సుమారుగా 165 నిమిషాల నిడివి తో ఈ చిత్రం ఉంటుందట, అంటే రెండు గంటల 12 నిమిషాలు అన్నమాట. ఈ సినిమాలో మొత్తం మీద నాలుగు పాటలు ఉంటారని , ట్రైలర్ తర్వాత మిగిలిన రెండు పాటలు వదులుతారని అంటున్నారు. అందులో ‘ఎత్తరా ఎత్తారా’ పాటకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడట. ఈ పాటని చివర్లో విడుదల చేస్తారని టాక్.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version