Ustad Bhagat Singh teaser : థియేటర్స్ లో విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్..ఫ్యాన్స్ కి ఇక పండగ!

ఈ గ్లిమ్స్ వీడియో ని కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు, థియేటర్ లో కూడా విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అడ్డా లాంటి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35 MM థియేటర్ లో విడుదల చేయబోతున్నారట.

Written By: NARESH, Updated On : May 9, 2023 9:16 pm

Ustad Bhagat Singh Teaser

Follow us on

Ustad Bhagat Singh teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రతి రోజు పండగలగానే ఉంది. ఆయన హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల గురించి రోజుకి ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది, అది ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇస్తుంది.నిన్న మొన్నటి వరకు #OG అప్డేట్స్ తో ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేనియా లో మునిగి తేలుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తి అయ్యింది, ఎడిటింగ్ వర్క్ కూడా ప్రారంభించి అప్పుడే గ్లిమ్స్ వీడియో ని కూడా సిద్ధం చేసేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ గ్లిమ్స్ వీడియో/టీజర్ ని ఎల్లుండి విడుదల చెయ్యబోతున్నారు. ఈ విషయాన్నీ నాలుగు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్.ఈరోజు మరోసారి ఖరారు చేసారు, ఈ గ్లిమ్స్ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట.

అయితే ఈ గ్లిమ్స్ వీడియో ని కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు, థియేటర్ లో కూడా విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అడ్డా లాంటి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35 MM థియేటర్ లో విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా థియేటర్ కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి సంబంధించినది టీజర్ అయినా , ట్రైలర్ అయినా గ్లిమ్స్ వీడియో అయినా థియేటర్స్ లో విడుదల చేస్తే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. థియేటర్ కెపాసిటీ కి మించి అభిమానులు రావడం, వాళ్ళ తాకిడికి తట్టుకోలేక థియేటర్ స్టాఫ్ కూడా సరిపోకపోవడం వంటివి వకీల్ సాబ్ ట్రైలర్ సమయం లో చూసాము.ఇప్పుడు మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కూడా అదే రిపీట్ కాబోతుంది.