Ustad Bhagat Singh Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న పవర్ స్టార్ సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.
ఈమధ్యనే ఎడిటింగ్ వర్క్ ని కూడా ప్రారంభించుకున్న ఈ చిత్రానికి సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో మే 11 వ తేదీన విడుదల చేయబోతున్నారని గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతూ వచ్చింది.నిన్న గాక మొన్న ప్రారంభమైన సినిమాకి అప్పుడే గ్లిమ్స్ వీడియో విడుదల చెయ్యడం ఏమిటి, అసలు అది ఎలా సాధ్యపడుతుంది అని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా గ్లిమ్స్ వీడియో ని గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే 11 వ తేదీన విడుదల చేయబోతున్నామని అధికారిక ప్రకటన చేసారు.ఈ ప్రకటనని ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ చేత చేయించారు.
ఈ వార్త వినగానే ఫ్యాన్స్ సంబరాలు మొదలు పెట్టారు.గ్లిమ్స్ వీడియో కి యూట్యూబ్ లో కేవలం 24 గంటల్లోనే 13 లక్షల లైక్స్ మరియు కోటికి పైగా వ్యూస్ రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ లైక్స్ వచ్చిన గ్లిమ్స్ వీడియో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాతాలోనే ఉంది.ఆయన హీరో గా నటించిన భీమ్లా నాయక్ గ్లిమ్స్ వీడియో కి 24 గంటల్లో 8 లక్షల లైక్స్ వచ్చాయి, మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిమ్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకెన్ని రికార్డ్స్ ని సృష్టించబోతున్నారో చూడాలి.
Rockstar @ThisIsDSP has some exciting news 🤩🤩
Let's celebrate a very special day with a blasting glimpse of #UstaadBhagatSingh on May 11th 💥💥
Mark the date 🔥🔥@PawanKalyan @harish2you @sreeleela14 @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/XTQl6QRxKy
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2023
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ustad bhagat singh teaser release date announced by producers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com