spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh : షాక్... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రద్దు! ఆ హీరో...

Ustaad Bhagat Singh : షాక్… ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రద్దు! ఆ హీరో మూవీ స్టార్ట్ చేస్తున్న హరీష్ శంకర్!

Ustaad Bhagat Singh : టాలీవుడ్లో హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్-హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ రద్దయిందట. దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ మూవీకి షిఫ్ట్ అయ్యాడట. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నాడట. సోషల్ మీడియాలో ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అనంతరం ప్రకటించిన చిత్రాల్లో భవదీయుడు భగత్ సింగ్ ఒకటి. హరీష్-పవన్ కాంబోపై ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉంది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగే ఫ్యాన్స్ ఆల్ టైం ఫేవరేట్ మూవీగా నిలిచిపోయింది.

పవన్ కళ్యాణ్ ని హరీష్ చూపించినంత మాస్ గా ఎవరూ చూపించలేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. అందుకే హరీష్ దర్శకత్వంలో పవన్ మూవీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. భవదీయుడు భగత్ సింగ్ తో అది సాకారం అయ్యింది. అనుకోని కారణాలతో ఆ స్క్రిప్ట్ కార్యరూపం దాల్చలేదు. అయితే అదే కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించారు. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు.

స్పెషల్ సెట్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోయిన్ శ్రీలీల సైతం షూటింగ్ లో పాల్గొంది. హరీష్ ఈ ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా నేడు ప్రాజెక్ట్ రద్దయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయంగా బిజీ కానున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టేశారట. ప్రస్తుతానికి ఈ మూవీ ఆగిపోయిందంటున్నారు.

దీంతో దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారట. త్వరలో హరీష్-రవితేజ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో జులై 28న విడుదలవుతుంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ 50% షూటింగ్ జరుపుకుందని వినికిడి. కాగా పవన్ పూర్తి చేయాల్సిన మరొక ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper
Exit mobile version