Ali Comments Ustad Bhagat Singh: సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి చిరాకాల మిత్రుల లిస్ట్ తీస్తే , అందులో కమెడియన్ అలీ కచ్చితంగా ఉంటాడు. మొదటి సినిమా పక్కన పెడితే, రెండవ సినిమా నుండి ‘కాటమరాయుడు’ చిత్రం వరకు అలీ లేకుండా సినిమా చేసేవాడు కాదు పవన్ కళ్యాణ్. కథలో అలీ కి స్కోప్ లేకపోయినా కూడా , ఎక్కడో ఒక చోట కావాలని అలీ ని సినిమాలో ఇరికించేవాడు పవన్ కళ్యాణ్. అంతటి స్నేహం వీళ్లిద్దరి మధ్య ఉండేది. అలాంటి ఈ మంచి స్నేహితుల మధ్య రాజకీయాలు బాగా గ్యాప్ తీసుకొచ్చాయి. 2019 ఎన్నికల సమయం లో అలీ వైసీపీ పార్టీ లో చేరడం, రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అలీ పై విమర్శలు చేయడం, అలీ కూడా అందుకు ధీటుగా కౌంటర్లు ఇవ్వడం వంటివి అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
Also Read: చిరంజీవి సోలోగా హిట్టు కొట్టలేడా… ఇప్పుడు ఇద్దరు హీరోలను సెట్ చేశాడు…
కలలో కూడా వీళ్లిద్దరు గొడవ పడరు అని అనుకున్న అభిమానులు , ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకోవడం అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోయారు. అయితే అలీ ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకున్నాడు. ఆయన వైసీపీ పార్టీ లో ఉన్నప్పుడు కూడా , పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి నేను సిద్దమే అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు కూడా. కానీ ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి ఎన్నికల తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే గతం లో ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గతం పవన్ కళ్యాణ్, అలీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాంబ గా అలీ మంచి పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఆ ఇంటర్వ్యూ లో రిపోర్టర్ అలీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘గతం లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరూ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లో మీకు మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో కూడా మీరు నాయించే అవకాశం ఉంటుందా ?’ అని అడగ్గా, అందుకు అలీ సమాధానం ఇస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ సింగ్ లాగానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆ సినిమాలో నటిస్తానా లేదా అనేది నా చేతుల్లో లేదు. అన్నీ సహకరించాలి’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ.
