Ustaad Bhagat Singh: భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం , ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హరీష్ శంకర్ నాసిరకం రైటింగ్ స్టైల్ , టేకింగ్ పవన్ వీరాభిమానులకు కూడా నచ్చలేదు. ఆయన్ని ఒక పవర్ స్టార్ గా చూడకుండా, జనసేనాని కూడా చూస్తూ సినిమా మొత్తం భజన, అర్థం పర్థం లేని ప్రాసలతో నింపేయడం తో, పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత బోరింగ్ చిత్రం గా పేరు తెచ్చుకుంది ఈ సినిమా. అయితే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. కనీసం ఇక్కడైనా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఈ చిత్రానికి ట్రోల్స్ తప్పలేదు. కానీ కొన్ని సన్నివేశాలకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
ఉదాహరణకు పాత బస్తి సన్నివేశాన్ని తీసుకోవచ్చు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సన్నివేశమే కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ యూత్ ఈ సన్నివేశానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే IPL సీజన్ లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం లోని సన్నివేశాలను ఎడిటింగ్స్ కి వాడుతూ వేరే లెవెల్ మీమర్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లోని ఈ సన్నివేశం కూడా ఈ IPL సీజన్ లో బాగా ట్రెండ్ అయ్యేలా అనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తోంది. ఏకంగా 15 దేశాల్లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఓజీ కూడా ఇదే రేంజ్ ట్రెండింగ్ ని సొంతం చేసుకున్న సంగత్ తెలిసిందే. ఊపు చూస్తుంటే మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రానికి 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చేలా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది. నెట్ ఫ్లిక్స్ లో ఫ్లాప్ సినిమాలకు ఈమధ్య కాలం లో ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే థియేటర్స్ లో ఆ చిత్రాన్ని పెద్దగా చూసి ఉండరు కాబట్టి , ఓటీటీ లో ఎగబడి చూస్తుంటారు. ఇలా గతం లో ‘గుంటూరు కారం’, ‘ఇడ్లీ కొట్టు’ వంటి చిత్రాలకు జరిగాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి కేవలం 103 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది.