Director Pramod Kumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు ఇద్దరు మాత్రమే టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. అందులో మొదట చిరంజీవి ఉండగా, ఆయన తర్వాత రవితేజ ఉండటం విశేషం… ఎప్పుడైతే తను హీరోగా మారాడో అప్పటినుంచి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. నిజానికి రవితేజ ను మొదట హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మాత్రం ఇక లేరనే చెప్పాలి. మనసిచ్ఛాను సినిమాతో రవితేజ సోలో హీరోగా పరిచయం చేశాడు. ఇక ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రవితేజ చాలా వరకు డీలా పడిపోయాడు.ఇక రీసెంట్ గా కుంభమేళలో పూసలు అమ్ముకున్న మోనాలిసా ఎంత పాపులారిటిని సంపాదించుకుందో మనందరికి తెలిసిందే…ఇక ఆమె తెలుగులో ‘వైఫ్’ అనే సినిమా చేస్తోంది. దానికి ప్రమోద్ కుమార్ కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆయన నిన్న భరత్ నగర్ లోని రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరొక ప్లాట్ ఫామ్ కి చేంజ్ అవుతున్న క్రమంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చి అతన్ని ఢీకొట్టింది.
దాంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో గత 25 సంవత్సరాల నుంచి తన సేవలను అందించే ప్రయత్నం చేస్తున్న ప్రమోద్ కుమార్ ఇలా అర్ధాంతరంగా ట్రైన్ ఢీ కొట్టి మరణించడం అనేది సినిమా ఇండస్ట్రీతో పాటు సగటు ప్రేక్షకులను సైతం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
నిజానికి ఆయన ఇప్పుడు ఇంకో సినిమా డైరెక్షన్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాడట. అంతలోనే ఆయనకు ఇలా జరగడం అనేది నిజంగా ఎవరు జీర్ణించుకోలేని విషయం… ఇతని మృతి పట్ల కొందరు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు సైతం అతని మృతి కి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అతనికి ఇండస్ట్రీలో దక్కిన గౌరవంగా మనం అభివర్ణించవచ్చు.
ఇక ఏది ఏమైనా కూడా రవితేజ కి లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఈయననే చెప్పాలి. ఇతను మొదట రవితేజ ను సినిమా హీరోగా తీసుకోవడం వల్లే ఆ తర్వాత ‘నీకోసం’ లాంటి సినిమాలో రవితేజకు ఛాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ లాంటి వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…