Ustaad Bhagat Singh: ‘ఓజీ'(They Call Him OG) సక్సెస్ తో ఫార్మ్ లోకి అడుగుపెట్టిన మెగా ఫ్యామిలీ, ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) సక్సెస్ తో మరోసారి మెగా అభిమానులకు పాత రోజులను గుర్తు చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. ‘ఓజీ’ చిత్రం ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టాలి కానీ, పాన్ ఇండియా లెవెల్ లో విడుదల లేకపోవడం తో కేవలం 320 కోట్ల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి, ఈ చిత్రం కచ్చితంగా ఓజీ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంతా అనుకున్నారు కానీ, కేవలం 300 కోట్ల వద్దే ఈ చిత్రం ఆగిపోయింది. అయితే కేవలం తెలుగు వెర్షన్ నుండి 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం సాధారణమైన విషయం అయితే కాదు.
పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కలెక్షన్స్ ని దాటుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే డైరెక్టర్ హరీష్ శంకర్ ని చూసి ఆడియన్స్ నమ్మకాలు పెట్టుకునే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. ఒకప్పుడు ఆయన మంచి డైరెక్టర్. అందులో ఎలాంటి సందేహాలు లేవు, కానీ ఆయన ఆలోచనలు 2012 వద్దే ఆగిపోయింది అనేది ఆయన గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ని చూసి చెప్పేయొచ్చు. అందులో ఫ్యాన్స్ నచ్చే సినిమా అంటే, హరీష్ శంకర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ భజన చేయడం మాత్రమే అన్నట్టుగా అనిపిస్తోంది. అలా సినిమా మొత్తం భజన చేస్తూ తీస్తే కేవలం మొదటి రోజు ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు, మామూలు ఆడియన్స్ చూడరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.
ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని వింటేజ్ యాంగిల్ లో చూపించడమంటే రీసెంట్ గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో అనిల్ రావిపూడి చిరంజీవి ని చూపించిన విధానమే. అలా చూపిస్తే మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది, మన శంకర వరప్రసాద్ గారు ఫుల్ రన్ లో సాధించిన వసూళ్లను ఈ సినిమా కేవలం మొదటి వారం లోనే రాబడుతుంది. అలా లేకపోతే మాత్రం అభిమానులు నిరాశపడక తప్పదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడుతుందా లేదా అనే అనుమానాలు కలగడానికి మరో కారణం రీమేక్. మేకర్స్ ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీ అని చెప్తున్నప్పటికీ కూడా ఆడియన్స్ నమ్మడం లేదు. ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తే తప్ప ఇది రీమేకా?, లేదా ఒరిజినల్ సినిమానా అనేది అర్థం అవ్వదు.