Ustaad Bhagat Singh Pawan Kalyan Character: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు…రవితేజ తో మిరపకాయ్, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆయన చేస్తున్న సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతుందని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు…పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా తో మరోసారి గబ్బర్ సింగ్ సక్సెస్ ని రిపీట్ చేయాలని ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి హరీష్ శంకర్ తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ మొదట కొంచెం తిక్క లోడిగా రాసుకున్నారట.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
కానీ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటే తనా పొలిటికల్ కెరియర్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ క్యారెక్టర్ ని మార్చి రాసినట్టుగా తెలుస్తోంది.
అలాగే పోలీస్ క్యారెక్టర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ చాలామంది పేదలకు సేవలు చేస్తూ, పెదాలను పట్టి పీడించే రౌడీల తుప్పు రెగ్గొట్టే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరి సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నప్పటికి హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ సినిమా కాదు అని మొదట్లోనే స్పష్టం చేశాడు. దానివల్లనే ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ గా చేసిన హరిహర వీరమల్లు సినిమా ఆశించైనా మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ప్రస్తుతం ఓజీ సినిమా మీద అతని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి వెళ్ళిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…