Ustaad Bhagat Singh OTT release: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది అభిమానులకు ఈ చిత్రం నచ్చినప్పటికీ, సాధారణ మూవీ లవర్స్ కి మాత్రం అసలు నచ్చలేదు. ఎదో పవన్ కళ్యాణ్ పాత సినిమాల స్పూఫ్ లాగా ఉందంటూ కామెంట్స్ చేశారు. పైగా ఈ చిత్రం పై ‘ధురంధర్ 2’ ఎఫెక్ట్ కూడా చాలా బలంగా పడింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కి కంచుకోటలుగా పిలవబడే ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ఈ వారం తో ముగిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓటీటీ లోకి కూడా త్వరగానే వచ్చేయొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
‘ఓజీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవుతున్న సినిమా కావడంతో ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారుగా 82 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే, ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన 4 వారాలకే ఓటీటీ లోకి రావాలి. అంటే ఏప్రిల్ 24 న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి రావాలి అన్నమాట. కానీ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా ముగిసిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 24 కంటే ముందే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ఏప్రిల్ 18 లేదా 19 కి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ గుడ్ ఫ్రైడే వరకు 100 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకోవచ్చని అంటున్నారు ఫ్యాన్స్.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎట్టకేలకు పరువు కాపాడింది..
మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాలి. గడిచిన మూడు రోజుల్లో కేవలం బుక్ మై షో యాప్ నుండి ఈ చిత్రానికి 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్ కలిపి 25 లక్షల మంది వీక్షించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి తక్కువ టిక్కెట్లు ఈ చిత్రానికే అమ్ముడుపోయాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా దీనికంటే బెటర్ ట్రెండింగ్ ఉండేదని, ఇలాంటి ఫ్లాప్ పవన్ కళ్యాణ్ కి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు ఫ్యాన్స్. మరి థియేటర్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.