Ustaad Bhagat Singh: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది సర్వసాధారణం… ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేసినప్పుడు అది కొంత మందికి నచ్చొచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా కూడా అల్టిమేట్ గా వాళ్ళు చేసే సినిమా జన్యూన్ అటెంప్ట్ అయితే మాత్రం దానిని అందరు స్వీకరిస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… గత సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ మరోసారి టచ్ లోకి వచ్చాడు. ఇక ఈ సంవత్సరం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 26వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఏ రేంజ్ బిజినెస్ చేస్తుంది. ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకర్తిస్తుంది… ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లు బడ్జెట్ ను కేటాయించారు. ఈ బడ్జెట్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఔట్ పుట్ వచ్చిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదిస్తే ఈజీగా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పొటెన్షియల్టిని వాడుకొని సినిమాని ఎలాగైనా సరే గ్రాండ్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది.
మరోసారి దానిని రిపీట్ చేసే ఉద్దేశ్యంతో వీళ్లిద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకైతే హరీష్ శంకర్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫ్లాప్ ను మూట గట్టుకున్న ఆయన ఈ సినిమాతో సూపర్ హిట్ ను అందుకొని మరోసారి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…