Ustaad Bhagat Singh song : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వచ్చే నెల 26న విడుదల అవ్వబోతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ నుండే కాదు, ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట విడుదల అయ్యాక కొంత గ్యాప్ ఇచ్చి నేడు ఈ చిత్రం నుండి రెండవ పాటని విడుదల చేశారు. ఈ పాట ని వాస్తవానికి 5:30 నిమిషాలకు విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాలు వల్ల ఈ పాటని కాస్త ఆలస్యం గా విడుదల చేశారు. కానీ అంతకంటే ముందే ఆడియో సాంగ్ లీక్ అయ్యింది. ఈ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ బాగుంది కానీ, చంద్రబోస్ రాసిన లిరిక్స్ మాత్రం చాలా నాశిరకంగా ఉన్నాయి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ‘నేను మెడ పట్టుకుంటే.. తొడ కొట్టినట్టే’ అట, ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాం ఇలాంటి డైలాగ్స్, ఈ జనరేషన్ కి ఇలాంటివి ఏమి ఎక్కుతాయి అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. అసలు ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకున్న చంద్రబోస్ నుండి ఇలాంటి పాట ఎలా వచ్చింది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీ లో అంతటి క్రేజీ న్యూ ఏజ్ సాంగ్స్ విన్న తర్వాత ఇలాంటి నాశిరకమైన పాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఈ పాటని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి. ఈ పాట విన్న తర్వాత మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ కలిగిందా?, లేదా బాగా అనిపించిందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ఈ పాట సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటుందని టాక్. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే, పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ పాటలతో పోలిస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ పాటలు తేలిపోయాయి. ఇక సినిమా ఎలా తీశాడో ఏంటో అని సోషల్ మీడియా లో పవన్ అభిమానులు భయపడుతున్నారు.