Ustaad Bhagat Singh collection : భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan )’ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన డైరెక్టర్ కదా, హరీష్ శంకర్ కచ్చితంగా మరో మెమరబుల్ సినిమాని అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘హరి హర వీరమల్లు’ ని మించిన ఫ్లాప్ ని మళ్లీ చూడలేమని అభిమానులు అనుకునేవారు, కానీ ఈ చిత్రం అంతకు మించిన పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి 20 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఈరోజు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 2 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
సోమవారం రోజున వర్కింగ్ డే అయ్యినప్పటికీ , ఈ చిత్రానికి నిన్న 26 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు ఈ మాత్రం టికెట్ సేల్స్ జరగడం గొప్ప విషయమే. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే . నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని. గ్రాస్ కచ్చితంగా 5 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా మొదటి నాలుగు రోజులకు కలిపి 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు 90 కోట్ల మార్కుని అందుకుంది. ఫుల్ రన్ మరో 15 నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీ కి మొదటి రోజే 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి వంద కోట్ల గ్రాస్ వారం రోజుల్లో రాబట్టడానికి కూడా కష్టతరంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అభిమానులు కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుత ట్రెండ్ లో రొటీన్ సినిమాలు చేస్తే సహించేది లేదని ఈ సినిమాతో చెప్పకనే చెప్పారు ఆడియన్స్. పవన్ కళ్యాణ్ కూడా ఇక మీదట ఇలాంటి సినిమాలు చేసేది లేదని నిన్నటి ట్వీట్ తో స్పష్టమైంది. కాబట్టి ఆయన నుండి కమర్షియల్ సినిమాలు కోరుకునేవాళ్ళు చివరి సారిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని చూసుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
