Ustaad Bhagat Singh: పొలిటికల్ హీట్ పెంచడానికే ఉస్తాద్ గ్లిమ్స్ వదిలారా..? ఈసారి అసెంబ్లీ లోకి పవన్ అడుగెడుతున్నడా..?

పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ ని మెయింటైన్ చేయడంతో జనంలో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ దానికి బూస్టాప్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో ఆయన అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : March 20, 2024 2:14 pm

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మూడు నెలల క్రితమే ముగిశాయి. కాబట్టి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్ల ఫీవర్ అనేది ఎక్కువగా నడుస్తుంది. తెలంగాణలో కేవలం పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆంధ్రాలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్థానాలకు ఎలక్షన్స్ ఉండడం వల్ల అక్కడ విపరీతమైన పొలిటికల్ హీట్ అయితే నడుస్తుంది.

అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యక్ష పొలిటిక్స్ లో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన కూడా పొలిటికల్ హీట్ పెంచడానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేశాడు. ఇక అందులో భాగంగానే దాంట్లో కొన్ని సెటైరికల్ గా పంచులు వేస్తూ గ్లాస్ గుర్తు యొక్క పవర్ ఏంటో తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇది చూసిన అధికార వైసిపి పార్టీ వాళ్ళకి మాత్రం కొంతవరకు భయం పట్టుకుందని చాలామంది రాజకీయ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ ని మెయింటైన్ చేయడంతో జనంలో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ దానికి బూస్టాప్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో ఆయన అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అటు ఎలక్షన్ల పరంగా, ఇటు సినిమాల పరంగా ఈ సంవత్సరం భారీ సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ జరుగుతున్న సర్వే ల ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మినిమమ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం పక్కా అంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…