Jr NTR legal protection: జూనియర్ ఎన్టీఆర్ పేరు పై ఇక నుండి ఎవరైనా దురుద్దేశంతో ట్రోల్స్ చేయడం, మీమ్స్ క్రియేట్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం, AI జెనెరేటేడ్ మార్ఫింగ్ వీడియోలు, లేదా ఫోటోలు క్రియేట్ చేయడం వంటివి చేస్తే జైలుకు వెళ్లక తప్పదు. అంతే కాకుండా ఎన్టీఆర్ పేరు ని ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు వాడుకోవాలని చూసినా తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ ని అభిమానులు ప్రేమతో ‘మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్’, ‘యంగ్ టైగర్’ వంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇకపై అనధికారికంగా అలాంటివి కూడా చేయొద్దని ఎన్టీఆర్ ఆఫీస్ నుండి ఒక లేఖ విడుదలైంది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా లో ఎన్టీఆర్ పేరు ని ఉపయోగించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. లేదంటే కెరీర్ పోగొట్టుకున్నట్టే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ తన వ్యక్తిగత సమాచారాన్ని భద్రత కలిగించాలంటూ గత ఏడాది ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు, ఆయన వ్యక్తిగత సమాచారాన్ని చట్ట భద్రత కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఈమధ్య కాలం లో ప్రతీ సెలబ్రిటీ చేస్తున్నారు. AI వచ్చిన తర్వాత ఏది నిజం, ఏది అబద్దం అనేది కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. AI ద్వారా క్రియేట్ చేయబడిన ఫోటోలు, వీడియోలను చూస్తే అవి నిజమైనవి గానే అనిపిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. అందుకే సినిమా సెలబ్రిటీలు హై కోర్టుని ఆశ్రయిస్తున్నారు. అంతే కాదు ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్స్ కూడా హద్దులు దాటుతున్నాయి. కంట్రోల్ లో ఉండాలంటే ఇలాంటివి చేయక తప్పేలా లేదు. ఐశ్వర్య రాయి బచ్చన్ తో ఇది మొదలైంది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రత కల్పించాలంటూ హై కోర్టు ని ఆశ్రయించారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘వార్ 2’ తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను అడవుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచిన ఎన్టీఆర్, త్వరలోనే మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మే నెల నుండి ఆయన ‘దేవర 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
#JrNTR – Personality Rights Protection pic.twitter.com/mWfHIV90UO
— Aakashavaani (@TheAakashavaani) January 29, 2026