Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సరిగ్గా మరో 12 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాది కల్కి, దేవర, పుష్ప 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. మన టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రాలివి. ‘గేమ్ చేంజర్’ చిత్రం పై కూడా ట్రేడ్ లో అలాంటి అంచనాలే ఉన్నాయి. కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని ఓవర్సీస్ ఆడియన్స్ ఒక్కొక్కరు వందల డాలర్లు ఖర్చు చేసి చూసారు. ఈ సినిమా విడుదలైన పక్క నెలలోనే ‘గేమ్ చేంజర్’ విడుదల కాబోతుండడంతో, ఆ ప్రభావం కనిపిస్తుందని , అభిమానులు అయితే టికెట్స్ భారీగానే కొంటున్నారు కానీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇంకా ఈ చిత్రం పై ఆసక్తిగా ఎదురు చూడడం లేదని ట్రేడ్ పండితుల వాదన.
ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ కంటెంట్ ఇంకా బయటకి రాలేదు. టీజర్ బాగానే పేలినప్పటికీ, అందులో కేవలం మూవీలోని కొన్ని షాట్స్ మాత్రమే పెట్టి, ఎదో ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టినట్టు ఉంది. అందుకే ప్రేక్షకులు థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఉంటే, కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ సినిమాకి వెయ్యి షోస్ కి గానూ 3 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. ట్రైలర్ వచ్చే లోపు నాలుగు లక్షల డాలర్లకు గ్రాస్ చేరవచ్చు. ఇదంతా పక్కన పెడితే సంక్రాంతికి విడుదలవుతున్న మూడు సినిమాలకు శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నార్త్ అమెరికా లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన బాలయ్య కి వీరాభిమాని.
నిన్న ట్విట్టర్ లో బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన ‘డాకు మహారాజ్’ స్పేస్ కి విచ్చేసిన శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత, గేమ్ చేంజర్ చిత్రం పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడుతూ ‘అక్కడ వాళ్ళు నన్ను ట్యాగ్ చేసి షోస్ పెంచమని పెద్ద ఎత్తున గోల చేస్తున్నారు. నార్త్ అమెరికా లో అసలు ఎలాంటి ప్యాట్రన్ ఉంటుంది అనేది వాళ్లకి అసలు తెలియదు. షోస్ కి జరుగుతున్నా అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి, సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి షోస్ పెంచుకుంటూ పోతారు. దానికి మేము ఏమి చెయ్యగలం’ అంటూ కామెంట్ చేసాడు. అంటే ఆయన దృష్టిలో గేమ్ చేంజర్ కి క్రేజ్ లేదని. దీనికి రామ్ చరణ్ అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. పుష్ప 2 చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ 3000 వేలకు పైగా షోస్ ని షెడ్యూల్ చేస్తే కేవలం ఈ సమయానికి 1 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. వాళ్ళ లాజిక్ ప్రకారం ఇది సరైన ట్రెండ్ కాదు కదా, ఎందుకు అన్ని షోస్ ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు.