Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి ప్లాన్ చేసిన ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి. ప్రతీ ఈవెంట్ కూడా అభిమానుల్లో జోష్ నింపేలా, చరిత్రలో ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉండేలా, రామ్ చరణ్ అభిమానులు చిరకాలం గుర్తించుకునేలా ఈ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే డల్లాస్ లో ఏర్పాటు చేసిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్ కి అసంఖ్యాకంగా అభిమానులు హాజరై పెద్ద హిట్ చేసారు. అదే విధంగా ఈరోజు విజయవాడ లో ఏర్పాటు చేసిన కటౌట్ లాంచ్ ఈవెంట్ కూడా అదిరిపోయింది. ఇదే ఈవెంట్ లో దిల్ రాజు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పిలవబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జనవరి 1వ తేదీన హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటన ఇండస్ట్రీ ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తో పాటు, సినీ పరిశ్రమ మొత్తం పై ఫైర్ అయ్యాడు. ఇక నుండి విడుదల అవ్వబోయే పాన్ ఇండియన్ సినిమాలకు బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ కి అనుమతిని ఇవ్వబోను అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. ఈ నేపథ్యం లో ఆయన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజుని రీసెంట్ గానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా నియమించాడు.
ఇండస్ట్రీ తరుపున దిల్ రాజు కి సీఎం రేవంత్ రెడ్డి తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ చనువుతోనే ఆయన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ కి రావాల్సిందిగా దిల్ రాజు కోరాడని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖత చూపించినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఈ చిత్రానికి బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ ఇవ్వబోతున్నారా? అని చర్చించుకుంటున్నారు నెటిజెన్స్. ఒకవేళ ఇస్తే ఏ రేంజ్ లో ఇవ్వొచ్చు, పుష్ప కి ఇచ్చినట్టే ఇస్తారా? అని మాట్లాడుకుంటున్నారు. రేపు, లేదా ఎల్లుండి లోపు ఈ ఈవెంట్ పై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.