Electronic Companies: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనిషి జీవితం మొత్తం స్మార్ట్ పరికరాలు చుట్టే తిరుగుతోంది.. మాట్లాడే ఫోన్, చేతికి పెట్టుకునే వాచ్, పని చేసే కంప్యూటర్… ఇలా సమస్తం ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టే మన జీవితం పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త పరికరాలు పుట్టుక రావటంతో పాత పరికరాలు మొత్తం డస్ట్ బిన్ లోకి వెళ్తున్నాయి. దీనివల్ల ఈ- వ్యర్ధాలు పేరుకు పోతున్నాయి. ఈ_ వ్యర్ధాల వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు 2021లో అధికారిక అంచనాల ప్రకారం భారతదేశంలో ఐదు మిలియన్ టన్నుల ఈ & వ్యర్ధాలు ఉత్పత్తయ్యాయి.. అనధికారిక అంచనాల ప్రకారం ఇవి ఇంకాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది.. దీనిని కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే గాలి, నీరు, భూ, శబ్ద కాలుష్యాల వల్ల మానవజాతి అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. అనేక జీవజాతులు అంతర్ధానమయ్యాయి. కొన్ని జాతులు అంతరించే దశలో ఉన్నాయి.. ఈ సమస్యలను మొత్తం దృష్టిలో పెట్టుకొని ఈ _ వ్యర్ధాల కట్టడికి భారత ప్రభుత్వ చొరవతో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఒక అంగీకారానికి వచ్చాయి.

మునుముందు రోజుల్లో ఏం చేస్తాయి అంటే
ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టాబ్లెట్ ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు వేర్వేరు చార్జర్లు ఉండేవి. వీటి యు ఎస్ బి అలా డిజైన్ చేయబడి ఉండేది. అయితే దీనివల్ల వ్యర్ధాలు పేరుకు పోతున్నాయి. టెక్నాలజీ మార్కెట్లో రోజుకో రకం వస్తువులు ఉత్పత్తి అవుతుండడంతో పాతవన్నీ కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్టబుల్ పరికరాల కోసం యూనివర్సల్ కామన్ చార్జర్లు తయారు చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.. ఇందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల బాధ్యులు సమావేశమయ్యారు. ఇకనుంచి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్ లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల కోసం యుఎస్బి టైప్_ సీ చార్జింగ్ పోర్ట్ కు మారుస్తాయి. అయితే ఇందులో తక్కువ ధర ఫీచర్ ఫోన్ల కోసం ఒకటి, పోర్టబుల్ పరికరాల కోసం మరొక చార్జర్ లను రూపొందించనున్నాయి. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ_ వ్యర్థాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ఈ వ్యర్థాలను కట్టడి చేసేందుకు ప్రామాణిక చార్జింగ్ పరికరాలు, ఆధునిక పోర్ట్ ల వైపు మళ్ళుతున్నాయి. యూరోపియన్ యూనియన్ లోని అన్ని దేశాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలకు యూఎస్ బీ_ సీ పోర్ట్ ను ప్రామాణికంగా చేస్తున్నారు.. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్ 7న యూరోపియన్ యూనియన్ దేశాల్లో విక్రయించే అన్ని భవిష్యత్తు స్మార్ట్ ఫోన్ ల చార్జర్లు యూ ఎస్ బీ_ సీ పోర్ట్ కు అనుకూలంగా మార్చాలని చేసిన చట్టాన్ని ఆమోదించారు. దీనిపై భారత్ ఒక విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్ ఫోన్లకు యూఎస్ బీ పోర్ట్_ సీ టైప్ చార్జర్ రూపొందిస్తే.. ఇప్పుడు ఉన్న పరికరాలను ఏం చేస్తారని ప్రశ్నిస్తోంది? అయితే దీనిపై స్పష్టమైన సమాధానం ప్రపంచ దేశాల నుంచి రాలేదు.. ఒకవేళ వీటిని రీసైక్లింగ్ చేసి కొత్త పరికరాలు రూపొందిస్తే అంతకుమించిన ఆనందం ఇంకొకటి లేదు.

కంపెనీలపై భారం తగ్గుతుంది
ఇక ఒకే ప్రామాణిక చార్జర్ తయారు చేయడం ద్వారా కంపెనీల మీద భారం తగ్గుతుంది.. ముఖ్యంగా అప్పటికే వినియోగదారులు చార్జర్ కలిగి ఉండటం వల్ల కొత్తగా వారికి చార్జర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.. దీనివల్ల కంపెనీపై ఆర్థిక భారం తగ్గుతుంది.. వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది.. ఎలాగూ చార్జర్ రాదు కాబట్టి ఉన్నదానిని జాగ్రత్తగా వాడుకుంటారు..దీనివల్ల ఈ_ వ్యర్ధాలు పేరుకుపోయే ప్రమాదం తప్పుతుంది.