Urvasivo Rakshasivo Collections: అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తూ మన ముందుకు వచ్చిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసీవో’..ఆసక్తికరమైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలను రేపిన చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..అయితే అల్లు శిరీష్ కి అసలు మార్కెట్ లేకపోవడం తో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అసలు ఏమాత్రం ఆశాజనకంగా జరగలేదు..కానీ పాజిటివ్ టాక్ రావడం తో కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా మాట్నీ షోస్ నుండి మంచి గ్రోత్ ని చూపించింది.

యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా కావడం..దానికి తగట్టు పాజిటివ్ టాక్ రావడం తో కచ్చితంగా ఈ సినిమాకి వీకెండ్ లో అదిరిపొయ్యే ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు జరిగింది..అల్లు శిరీష్ ప్రస్తుతం ఉన్న రేంజ్ కి ఇది ఎక్కువే..అయితే మొదటి రోజు ఓపెనింగ్ ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి విశ్లేషిద్దాం.
నూన్ షోస్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ..టాక్ బాగా రావడం తో మాట్నీస్ నుండి చిన్నగా పికప్ అవుతూ వచ్చింది..ఫస్ట్ షోస్ అయితే మేజర్ సిటీస్ మరియు టౌన్స్ లో కలెక్షన్స్ అదిరిపోయాయి..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే వీకెండ్ లో ఉన్న రెండు రోజులు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఫుల్ రన్ లో కూడా స్టడీ కలెక్షన్స్ రావాలి..అప్పుడే బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు ఉంటాయి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటీవలే విడుదలైన విశ్వక్ సేన్ ఓరి దేవుడా చిత్రం కూడా ఇలాగె స్లో గా ప్రారంభమై ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని హిట్ గా నిలిచింది..ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసీవో’ చిత్రం కూడా అదే స్థాయిలో రాణించి హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.