Manchu Vishnu- Sunny Leone: మంచు విష్ణు హీరో గా నటిస్తూ నిర్మించిన జిన్నా చిత్రం ఇటీవలే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ తారాగణం తో సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్స్ ని ఈ సినిమాలో పెట్టుకున్నప్పటికీ కూడా కారి రెమ్యూనరేషన్స్ ని కూడా రికవర్ చెయ్యలేని దుర్భర పరిస్థితి రావడం నిజంగా మంచు ఫ్యామిలీ కి ఘోరమైన అవమానకరం అనే చెప్పాలి.

కేవలం మంచు అనే బ్రాండ్ వల్లే ఇంత దారుణమైన ఫలితం వచ్చిందని..వేరే హీరో ఇదే కథ తో సినిమా చేసి ఉంటే కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉండేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..థియేట్రికల్ పరంగా 4 కోట్ల రూపాయలకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం కోటి రూపాయిలు కూడా వసూలు చెయ్యకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటు కి అమ్ముడుపోయినట్టు సమాచారం..హిందీలో మన తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..అక్కడ డబ్ అయినా సినిమాలకు అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయి..ఇక సన్నీ లియోన్ అంటే బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ ఆమె అంటే పది సచ్చిపోతారు..అందుకే జిన్నా మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ దాదాపుగా పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఈ సినిమాలో నటించినందుకు గాను మంచు విష్ణు సన్నీ లియోన్ కి 3 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చాడట..అయితే థియేట్రికల్ రన్ లో సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ ని రికవర్ చేయలేకపోయినా ఈ చిత్రం , డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా ఆ రెమ్యూనరేషన్ ని రికవర్ చెయ్యడమే కాకుండా లాభాలను కూడా అందుకున్నాడట మన మంచు విష్ణు..ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.