Avatar 2- Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గత ఏడాది విడుదలై ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాతో జెండా పాతేసిన హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ ఎవరికీ లేదనే చెప్పాలి.. ఇప్పుడు ఆయన పుష్ప 2 కి సీక్వెల్ తీస్తున్నారు.

పుష్ప పార్ట్ -1 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పార్ట్ 2పై పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది. బాహుబలి , కేజీఎఫ్ సీక్వెల్స్ కంటే ఎక్కువ హైప్ ఏర్పడింది..దీంతో ఈ మూవీ స్క్రిప్ట్ పై సుకుమార్ ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు..ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిపోవడంతో నవంబర్ 12 వ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది..ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని డిసెంబర్ 16వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..అదే రోజు ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న అవతార్ పార్ట్ 2 విడుదల కాబోతుంది..ఈ సినిమా కి పుష్ప 2 టీజర్ ని అటాచ్ చేయించబోతున్నారట..అదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్స్ లో కూడా పుష్ప 2 టీజర్ ప్రదర్శితమవుతుంది..ఆ విధంగా ఈ చిత్రానికి కనివిని ఎరుగని రేంజ్ ప్రమోషన్ దక్కబోతోంది అన్నమాట.

సీక్వెల్ హైప్ తో వచ్చిన బాహుబలి , కేజిఎఫ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పుష్ప సినిమాకి వచ్చిన రీచ్ గడిచిన రెండు దశాబ్దాలుగా ఏ సినిమాకి కూడా రాలేదని చెప్పొచ్చు..మరి అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికి కూడా మనకి సాధ్యం కాదనే చెప్పాలి.