Urvashi Rautela: బాలీవుడ్ లో అయినా.. టాలీవుడ్ లో అయినా ప్రేమలు.. పెళ్లిళ్లు కామన్.. తెలుగ ఇండస్ట్రీలో ఈ వ్యవహారాలు తక్కువైనా.. బాలీవుడ్ లో మాత్రం షర్ట్ లు విప్పినంత ఈజీగా భాగస్వాములను మార్చేస్తుంటారు. ఇప్పటికే వర్ధమాన హీరోలు, హీరోయిన్లు ప్రేమలు, డేటింగ్ లు అంటూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్.. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేసే ఊర్వశి రౌతేలా గురించి కూడా ఓ వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది.

ఊర్వశి రౌతేలా బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాల్లో మునిగిందన్న వార్త ఒకటి ఉంది. ఆమె ఎప్పుడూ తన ట్విటర్ ఖాతాలో ‘RP’ అంటూ పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఇది చూసి అందరూ ‘రిషబ్ పంత్’తో ఈమె ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని అనుకున్నారు. ఊర్వశితో క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ప్రేమ పుకార్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా వ్యాపించాయి.
అయితే తాను ‘RP’ పేరుతో పెడుతున్న పోస్టులు రిషబ్ పంత్ ను ఉద్దేశించి కావని.. అసలు పంత్ తో తనకు ఎలాంటి ఎఫైర్లు, ప్రేమ, డీలింగ్స్ లేవని క్లారిటీ ఇచ్చింది ఊర్వశి. తానెప్పుడూ పంత్ ను కలవలేదంటూ స్పష్టం చేసింది. మరి ఆర్పీ అంటే ఎవరంటూ అడిగితే మన తెలుగు యంగ్ హీరో పేరు చెప్పడం గమనార్హం.

ఆర్పీ అంటే టాలీవుడ్ హీరో ‘రామ్ పోతినేని’ అని ఊర్వశి వెల్లడించింది. రిషబ్ పంత్ ను ‘ఆర్పీ’ అంటారనే విషయం తనకు తెలియదని ఊర్వశి చెప్పుకొచ్చింది. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఊర్వశి హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సాన్నిహత్యంలోనే రామ్ పోతినేనితో దగ్గరైంది.. ప్రేమలో విహరిస్తోందని టాక్ నడుస్తోంది.
T