https://oktelugu.com/

Urvashi Rautela- Pawan Kalyan: గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… చర్చకు దారి తీసిన స్టార్ హీరోయిన్ ట్వీట్!

ఊర్వశి రాతెలా బ్రో మూవీలో ఓ ఐటెం సాంగ్ చేశారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో కూడా ఆమె ఒక సాంగ్ లో చిరంజీవి సరసన ఆడిపాడారు. నెక్స్ట్ బోయపాటి శ్రీను-రామ్ పోతినేని మూవీలో సందడి చేయనుంది. స్కంద టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఊర్వశి రాతెలా ఓ ఐటెం సాంగ్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 28, 2023 / 08:44 AM IST

    Urvashi Rautela- Pawan Kalyan

    Follow us on

    Urvashi Rautela- Pawan Kalyan: హీరోయిన్ ఊర్వశి రాతెలా ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఆమె కామెంట్ జోష్ నింపగా, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేశారో చూద్దాం. పవన్ కళ్యాణ్ సీఎం పీఠం అధిరోహిస్తే చూడాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి సభలో సీఎం నినాదాలు వినిపిస్తాయి. ఇటీవల జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సీఎం నినాదాలతో ఫ్యాన్స్ శిల్పకళా వేదికను హోరెత్తించారు.

    ఈ క్రమంలో ఊర్వశి రాతెలా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రితో నటించడం గొప్ప అనుభూతి పంచింది. బ్రో రేపు విడుదల అవుతుంది. ఒక పొగరుబోతు వ్యక్తి మరణించాక తన తప్పులు తెలుసుకుంటే ఏమవుతుంది అనేది కథ, అందరూ బ్రో మూవీ చూడండి.. అని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆమె నిర్ధారించడం చర్చకు దారి తీసింది.

    మా అన్న పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అని ఊర్వశి రాతెలాకు అప్పుడే తెలిసిపోయిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. మెగా హీరోల మెప్పు కోసం ఆమె ఇలాంటి ట్వీట్ చేశారని అంటున్నారు. గత ఏడాది ఊర్వశి లెజెండ్ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర హీరో అరుళ్ శరవణన్ ని ఉద్దేశిస్తూ ఇదే తరహా కామెంట్ చేశారు. ప్రెస్ మీట్లో… అరుళ్ రాబోయే పదేళ్లలో తమిళనాడు సీఎం అవుతారని అన్నారు. అరుళ్ దెబ్బకు షాక్ అయ్యాడు.

    ఇక ఊర్వశి రాతెలా బ్రో మూవీలో ఓ ఐటెం సాంగ్ చేశారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో కూడా ఆమె ఒక సాంగ్ లో చిరంజీవి సరసన ఆడిపాడారు. నెక్స్ట్ బోయపాటి శ్రీను-రామ్ పోతినేని మూవీలో సందడి చేయనుంది. స్కంద టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఊర్వశి రాతెలా ఓ ఐటెం సాంగ్ చేశారు.