Krithi Shetty: ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది. యూత్ లో మంచి క్రేజ్ రాబట్టింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉప్పెనలో కృతి కాలేజ్ గర్ల్ గా తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే క్లైమాక్స్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. వంద కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రాల జాబితాలో చేరింది.
ఆ వెంటనే మరో రెండు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. నానికి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్యామ్ సింగరాయ్ లో కృతి మోడ్రన్ గర్ల్ గా కొంచెం బోల్డ్ రోల్ చేసింది. హీరో నానితో బెడ్ రూమ్ సన్నివేశాల్లో పాల్గొంది. ఇక 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీలో నాగ చైతన్యకు జంటగా నటించింది. అలా హ్యాట్రిక్ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అయితే ఆ జోరు కొనసాగించడంలో కృతి శెట్టి ఫెయిల్ అయ్యింది.
స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడింది. కృతి శెట్టికి వరుసగా నాలుగు ప్లాప్స్ పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఒక్కసారిగా కృతి శెట్టి కెరీర్ తిరగబడింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కి దూరమైంది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైంది. శర్వానంద్ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు.
కార్తీ, విశాల్ చిత్రాల్లో కృతి శెట్టి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు. కెరీర్ నెమ్మదించిన క్రమంలో గ్లామర్ షో చేస్తుంది. తాజాగా చీరలో సోయగాలు పరిచయం చేసింది. బేబమ్మ గ్లామర్ షో హాట్ టాపిక్ అవుతుంది. కృతి శెట్టి శారీలో అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆఫర్స్ కోసమే కృతి శెట్టి గ్లామర్ షో చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram