Upendra Kabza : పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు అయ్యింది ఉపేంద్ర ‘కబ్జా’ పరిస్థితి..షాకింగ్ బుకింగ్స్

Upendra Kabza : ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియన్ సినిమాల హవానే నడుస్తుంది.అలా అని ప్రతీ పాన్ ఇండియన్ సినిమాని జనాలు ప్రోత్సహించడం లేదు.ఈమధ్యనే కన్నడ సినీ పరిశ్రమ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించడం మనం చూసాము.గత ఏడాది KGF చాప్టర్ 2 అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలై ప్రభంజనం సృష్టించగా,అదే ఏడాది విడుదలైన మరో కన్నడ చిత్రం ‘కాంతారా’ కూడా వసూళ్ల సునామి ని సృష్టించింది. అదే ఊపులో కన్నడ […]

Written By: NARESH, Updated On : March 15, 2023 9:16 pm
Follow us on

Upendra Kabza : ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియన్ సినిమాల హవానే నడుస్తుంది.అలా అని ప్రతీ పాన్ ఇండియన్ సినిమాని జనాలు ప్రోత్సహించడం లేదు.ఈమధ్యనే కన్నడ సినీ పరిశ్రమ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించడం మనం చూసాము.గత ఏడాది KGF చాప్టర్ 2 అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలై ప్రభంజనం సృష్టించగా,అదే ఏడాది విడుదలైన మరో కన్నడ చిత్రం ‘కాంతారా’ కూడా వసూళ్ల సునామి ని సృష్టించింది.

అదే ఊపులో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా భారీ తారాగణం తో , భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ‘కబ్జా’ అనే చిత్రం లో నటించాడు.ఈ సినిమాలో కన్నడ స్టార్స్ గా వెలుగొందుతున్న సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ వంటి హీరోలు ముఖ్య పాత్రలు పోషించారు.అలా ఎన్నో హంగులు ఆర్భాటాలతో నిర్మించిన ఈ సినిమా 17 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.కానీ ఉపేంద్ర ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలన్నీ తారుమారయ్యేలా చేసింది అడ్వాన్స్ బుకింగ్స్.మిగిలిన బాషల సంగతి కాసేపు పక్కపెడితే, కన్నడ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.ఒక భారీ స్కేల్ మీద తెరకెక్కించిన ఒక చిత్రానికి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఈమధ్య కాలం లో ఇదే తొలిసారి.

అందుకు కారణం ఈ చిత్రానికి సంబందించి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్లే.బాగా రిచ్ గా తీశారనే విషయం అర్థం అయ్యింది కానీ, ఎందుకో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అనిపించినా ఫీలింగ్ ఏమిటంటే KGF చిత్రాన్ని మళ్ళీ రీమేక్ చేసారా అని..? , టేకింగ్ మొత్తం అదే స్టైల్ లో ఉండడం, జనాలకు కొత్తగా అనిపించకపోవడం వల్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత డల్ గా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.