
సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సహా అగ్రహీరోలందరూ వేర్వేరు సినిమాల్లో లాక్ అయిపోవడంతో అనిల్ రావిపూడి ఖాళీగా ఉన్నారు.
ప్రస్తుతం ‘ఎఫ్3’ మూవీని తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఈ మూవీ తర్వాత మహేష్ బాబుతో సినిమాను ప్లాన్ చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు అగ్రదర్శకులతో సినిమాలకు లాక్ అయిపోవడంతో అవి ముందుకు సాగడం లేదు.
దీంతో గత కొంతకాలంగా బాలయ్య బాబుతో సినిమా చేద్దామనుకుంటున్న అనిల్ రావిపూడి ఇప్పుడు దానికి రెడీ అయిపోయాడు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పలువురు ఫ్యాన్స్ తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాలయ్య తన తరువాత ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ తో సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని బాలక్రిష్ణ క్లారిటీ ఇచ్చేసారు. నిర్మాత సాహు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య ‘గోపీచంద్ మలినేని’తో సినిమాను ప్రకటించాడు. ఆ సినిమాను పూర్తి చేసి అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య నటించనున్నారు.