Aadhi Pinisetty: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి(Aadhi Pinisetty). ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి, 2006 వ సంవత్సరం లో తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఒక వి చిత్రం’ అనే సినిమా ద్వారా హీరోగా మన ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళం లో వరుసగా హీరోగా నటించి మంచి విజయాలను అందుకున్న ఆయన, మళ్ళీ టాలీవుడ్ లోకి ‘గుండెల్లో గోదారి’ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. అలా హీరో గా ఒక పక్క రాణిస్తూనే , మరోపక్క విలన్ గా సరైనోడు చిత్రం లో నటించి అదరగొట్టేసాడు. అలా కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ రకాల క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.
Also Read: విడుదలైన ‘చావా’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్..హీరోకి ఇచ్చిన డబ్బింగ్ అసలు సూట్ అవ్వలేదుగా!
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘శబ్దం’ చిత్రం తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకోని ఒక సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో నాకు కళ్ళజోడు ఇచ్చారు. ఎందుకో తెలియదు, ఆ కళ్ళజోడు నాకు చాలా బాగా నచ్చింది. సెట్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా, ఎవరికీ చెప్పకుండా నాతో పాటు తీసుకొచ్చేసాను. నేను తీసుకొచ్చిన తర్వాత ఆ కళ్ళజోడు గురించి ఎవ్వరూ నన్ను అడగలేదు, నేను కూడా తిరిగి ఇవ్వలేదు. దీనిని దొంగతనం అని మీరు అనుకున్నా పర్వాలేదు, ఆ కళ్లజోడుని చూసినప్పుడల్లా రంగస్థలంలో నా క్యారక్టర్ గుర్తుకు వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘రంగస్థలం’ చిత్రం లో రామ్ చరణ్(Global Star Ram Charan) అన్నయ్య గా ఆది పినిశెట్టి ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆయనకు రామ్ చరణ్ సమానమైన క్యారక్టర్ పడింది. కాకపోతే రామ్ చరణ్ కి పాటలు ఉన్నాయి, ఇతనికి లేదు అదొక్కటే తేడా. అనేక సన్నివేశాల్లో ఆడియన్స్ ని కన్నీళ్లు పెట్టుకునే రేంజ్ లో జీవించాడు ఆది పినిశెట్టి. రంగస్థలం చిత్రం లో రామ్ చరణ్ తర్వాత అంత అద్భుతంగా నటించిన నటుడు ఎవరు అని అడిగితే ఆది పినిశెట్టి పేరునే చెప్తారు. సరైనోడు లో అంత క్రూరమైన విలన్ గా నటించి, ‘రంగస్థలం’ ఇంతటి అమాయకమైన క్యారక్టర్ ఎలా పోషించాడు?, ఈ రేంజ్ వేరియేషన్స్ చూపించాడంటే ఇతను సాధారణమైన నటుడు కాదంటూ అప్పట్లో అందరూ ఆయన్ని పొగిడారు. ప్రస్తుతం బాలకృష్ణ(Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోనుంది.