Homeఎంటర్టైన్మెంట్Upasana Konidela: ఉపాసన నుంచి గుడ్ న్యూస్.. మెగాస్టార్ మనవడు కమింగ్ సూన్.. ...

Upasana Konidela: ఉపాసన నుంచి గుడ్ న్యూస్.. మెగాస్టార్ మనవడు కమింగ్ సూన్.. ఇక పండగే

Upasana Konidela: మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’కి రామ్‌చరణ్‌ తో పెళ్లి అయ్యి ఇప్పటికీ పదేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ వీరికి సంతానం లేదు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ సాగుతూనే ఉంటుంది. ‘ఉపాసన’కు సైతం తరచూ ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఇదే విషయం గురించి పదే పదే అడగడంతో ఉపాసన విసిగిపోయింది. చివరకు ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర పిల్లలను కనడం అనే కాన్సెప్ట్ గురించి క్లారిటీగా అడిగింది.

Upasana Konidela
Upasana Konidela

అయితే, సద్గురు మాత్రం ‘ఏ అమ్మాయిలు అయితే పిల్లలను కనకుండా ఉంటారో నేను వారందరికీ అవార్డులు ఇస్తాను. నేటి తరం ఆడవాళ్లు పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మన ప్రపంచ జనాభా ఎక్కువ అయిపోయింది’ అంటూ సద్గురు చెప్పుకొచ్చారు. మొత్తానికి సద్గురు ఇన్ డైరెక్ట్ గా ఉపాసనకి సపోర్ట్ చేశారు.

Also Read: Gopichand Malineni- Balakrishna: గోపీచంద్’కి బాలయ్య సీరియస్ వార్నింగ్.. కారణం అదే

అయితే, తాజాగా ఉపాసన సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘సద్గురు.. మీ అవార్డు తీసుకునేందుకు మా తాత గారు అంగీకరించడం లేదు’ అని కామెంట్ పెట్టింది. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టు పెట్టగానే.. నెటిజన్లు తెగ షేర్ అండ్ లైక్ చేస్తున్నారు. దాంతో ఉపాసన పోస్ట్ వైరల్ గా మారింది. పైగా ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Upasana Konidela
Upasana Konidela

త్వరలోనే మెగాస్టార్ గ్రాండ్ సన్ వచ్చేస్తున్నాడంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే జూనియర్ చెర్రీ వచ్చేస్తున్నాడని.. మెగా వారసుడు రాక ఇక త్వరలోనే అంటూ రామ్ చరణ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పైగా త్వరలోనే మెగాస్టార్ గ్రాండ్ చైల్డ్ కమింగ్ సూన్ వావ్’ అంటూ ఈ మెసేజ్ ను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మెసేజ్ తో ఉపాసన పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం అవుతుంది.

Also Read:Gopichand Malineni- Balakrishna: గోపీచంద్’కి బాలయ్య సీరియస్ వార్నింగ్.. కారణం అదే
Recommended Videos
Grand welcome to Mega Princess Upasana Konidela In America || Upasana Konidela Latest Video
ఆ ఫొటో వెనుక కథ! || Pawan Kalyan Twitter DP In Trending || #TwitterDP || Oktelugu Entertainment
Pragathi Aunty MIND-BLOWING Dance Performance || Pragathi Latest Dance Video With Her Daughter

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version