Upasana Kamineni: ఉపాసన కొణిదెల గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఫ్రొఫైల్ ఉంది. ఆమెను జస్ట్ చిరంజీవి కోడలు, చరణ్ భార్య అంటూ పరిచయం చేయడం సరికాదు. ఆ ఫ్యామిలీకి కోడలిగా రావడం వలన ఆమె మాస్ వర్గాలలో కూడా ఫేమస్ అయ్యారు. అయితే వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఉపాసన, తెలంగాణా రాష్ట్రంలోని దోమకొండ సంస్థానం వారసురాలు.

ఇక గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ ఉపాసన లైఫ్ ని ఛాలెంజింగ్ గా మలచుకున్నారు. ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. బి పాజిటివ్ హెల్త్ అండ్ ఫ్యాషన్ మ్యాగజైన్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్ తరపున కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్స్ ని ఇంటర్వ్యూ చేయడం విశేషం.
మట్టివాసన తెలియని ఉపాసనకు సోషల్ సర్వీస్ అంటే కూడా ఇష్టం. అలాగే జంతువులను, ప్రకృతి వ్యవసాయాన్ని ఇష్టపడతారు. ఇవి కాకుండా ఉపాసనకు ట్రాన్స్ జెండర్ వర్గం అంటే అమితమైన ప్రేమ. వాళ్ళతో ఆమె స్నేహం చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ట్రాన్స్ జెండర్స్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఉపాసన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సినిమాలలో వాళ్ళను తక్కువగా చూపించడం, చులకన చేసి హాస్యం పండించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో గౌరవం కలిగిన వర్గంగా వాళ్ళను తీర్చిదిద్దాలని, వాళ్ళ పట్ల ప్రజల ఆలోచనా ధోరణి మార్చాలని కోరుకుంటున్నారు.
తాజాగా ఉపాసన తన చెల్లి అనుష్పాల పెళ్లి వేడుకకు ట్రాన్స్ జెండర్స్ ని ఆహ్వానించారు. వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆశీర్వాదం అందుకున్నారు. అదే సమయంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని తాను ఎంతగానో గౌరవిస్తానని ఇంస్టాగ్రామ్ వేదికగా కామెంట్ చేశారు. వాళ్ళతో దిగిన ఫోటోలు పంచుకున్నారు.
Also Read: Akhanda: బాలయ్య అఖండ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది ఎవరంటే…
ఇవన్నీ గమనిస్తున్న కొందరు ఉపాసనకు ట్రాన్స్ జెండర్స్ అంటే ఎందుకంత అభిమానమే సందేహాలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ అంతలా వాళ్లతో మమేకం అవ్వాల్సిన అవసరం ఏమిటీ? దీని వెనకున్న అసలు రహస్యం ఏమిటీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన ప్రవర్తన గతంలో ఆమెపై ప్రచారమైన పుకార్లకు బలం చేకూర్చుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కాగా 2012లో ఉపాసనను రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగి దాదాపు 9 ఏళ్ళు అవుతుండగా ఇంకా ఉపాసన తల్లి కాలేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అది మా వ్యక్తిగత విషయం. దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేసినా… మీడియా దాన్ని సెన్సేషన్ చేస్తుంది… అంటూ ఆమె తప్పించుకున్నారు.
Also Read: Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…