Upasana: గత ఏడాదే మెగా అభిమానులు ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్న వార్త మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – ఉపాసన ఇద్దరూ తల్లితండ్రులు కాబోతున్నారని, ఈ వార్త విన్న తర్వాత తనకి ఎంత ఆనందం గా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాని, మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో చెప్పిన మాటలు విని మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ భూలోకం లోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక శుభ వార్త. రేపే ఉపాసనకు అపోలో హాస్పిటల్స్ లో డెలివరీ కాబోతుందట.అందుకోసం ప్రపంచం లో ఉన్న ప్రఖ్యాత గైనకాలజిస్ట్స్ అందరినీ పిలిపించారని, బిడ్డ ఆరోగ్యం గా సురక్షితంగా బయటకి వచ్చేందుకు అంన్నీ విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు గా తెలుస్తుంది. ఉపాసన కోసం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేసారు.
కేవలం కుటుంబ సబ్యులకు మినహా, వ్యక్తిగత సిబ్బందికి కూడా లోపలకు అనుమతి లేదు. బిడ్డకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారట. రామ్ చరణ్ గత రెండు రోజుల నుండి ఉపాసన అవసరాలను చూసుకునేందుకు అపోలో హాస్పిటల్ లోనే ఉన్నాడట. గత కొంత కాలం గా ఆయన షూటింగ్స్ కి దూరం గా ఉంటూ, కేవలం ఉపాసన కోసమే ఇంట్లో ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటే వచ్చేవాడు. ఇన్ని రోజులు వీళ్లిద్దరు ప్రత్యేకమైన అపార్ట్మెంట్స్ లో నివసిస్తూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇక నుండి రామ్ చరణ్ ఉపాసన దంపతులు చిరంజీవి ఇంట్లోనే ఉండబోతున్నారట. అందుకోసం చిరంజీవి తన ఇంటిలోని పై ఫ్లోర్ లో గత కొంత కాలం గా మరమ్మత్తులు చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు అవన్నీ పూర్తి అయ్యాయట. ఇక మరో పక్క రామ్ చరణ్ కి వారసుడు వస్తున్నాడా, లేదా వారసురాలు రాబోతోందా అని తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.