Balakrishna- Radhika: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న షో ప్రస్తుతం నాలుగో ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాలయ్య షోను రసవత్తరంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇంతవరకు ఏ షో చేయని బాలయ్య దీంతో అందరిలో ఆసక్తి రేపుతున్నారు. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను తీసుకొచ్చారు. వారిని పలు రకాలుగా ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

రెండో ఎపిసోడ్ లో కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను ఆహ్వానించారు. మూడో ఎపిసోడ్ లో శర్వానంద్, అడవి శేషులకు ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో శర్వానంద్ బాలకృష్ణ ను ఓ ప్రశ్న అడిగారు. మీరు ఎందరో హీరోయిన్లతో చేశారు కదా మీపై ఎవరు కూడా వార్తలు రాయలేదా అంటే అంత దమ్ము ఎవరికి ఉందని బదులివ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం నాలుగో ఎపిసోడ్ నడుస్తోంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ రెడ్డిలను తీసుకొచ్చారు.
ఈ షోలో అప్పటి హీరోయిన్ రాధిక కూడా అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. చిరంజీవితో పలు చిత్రాలు చేసిన హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు ఉంది. దీంతో ఆమె చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అందరు అవాక్కయ్యారు. తనకు చిరంజీవికి మధ్య సురేఖ దూరేదని చెప్పుకురావడంతో అందరు నోరెళ్లబెట్టారు. రాధిక మాట్లాడుతుంటే బాలయ్య కూడా మధ్యలో దూరడంతో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాధిక అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి వారితో సినిమాలు చేసిన విషయం గురించి తెలియజేసింది. దీంతో ఇద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి.

ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని చెబుతున్నా బాలయ్య ముందుకు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో సీజన్ లో వీరిని ఆహ్వానిస్తారనే చెబుతున్నారు. దీంతో బాలయ్య చేసే సందడితో అన్ స్టాపబుల్ షో ఘనంగా ముందుకు సాగుతోంది. పలువురిని ఆహ్వానించి వారితో పలు విషయాలు పంచుకుంటూ సరదాగా గడుపుతున్నారు. బాలయ్య బాబు అన్ని తానై నడిపిస్తున్నారు. షో లో తనదైన శైలిలో కొంటె ప్రశ్నలు వేస్తూ అందరిని నవ్విస్తున్నారు.