‘Unstoppable with NBK’ : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న ప్రోమో సంక్రాంతి కానుకగా రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆహా మీడియా వారు ఈరోజు ట్విట్టర్ లో తెలియజేసారు..పవన్ కళ్యాణ్ తన రెండు దశాబ్దాల కెరీర్ లో ఎప్పుడూ కూడా ఇలాంటి టాక్ షోస్ లో పాల్గొన్నది లేదు.

కానీ బాలయ్య బాబు మరియు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చెయ్యడం తో పవన్ కళ్యాణ్ కాదనలేక ఈ టాక్ షో లో పాల్గొనడానికి ఒప్పుకున్నాడు..గత ఏడాది డిసెంబర్ 27 వ తారీఖున ఈ ఎపిసోడ్ ని షూట్ చేసారు..సంక్రాంతికి కి స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నారు..కానీ మధ్యలో ‘వీర సింహా రెడ్డి’ మూవీ టీం కి సంబంధించిన ఎపిసోడ్ ని షూట్ చేశారు.
ఇటీవలే ఆ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసారు..ఇక సోషల్ మీడియా లో మా పవర్ స్టార్ ఎపిసోడ్ ఎప్పుడూ అంటూ ప్రతీరోజూ ఆహా మీడియా ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు..అభిమానుల ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు విడుదల చేసి, జనవరి 26 వ తేదీన టెలికాస్ట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారట.
ఈ సీజన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అప్లోడ్ చేసారు..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని కూడా అలాగే చేయబోతున్నారట..పవన్ కళ్యాణ్ లోని ఎన్నడూ మనం చూడని కోణాలను ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు..అంత బాగా ఈ ఎపిసోడ్ వచ్చిందట..చూడాలిమరి డిజిటల్ మీడియా లో ఈ ఎపిసోడ్ ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో అనేది.