
Unstoppable with NBK’ Pawan Kalyan : ఆహా మీడియాలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంతటి ప్రజాదరణ పొందిందో మన అందరికీ తెలిసిందే.. బాలయ్యకి సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఈ షో బాగా ఉపయోగపడింది.. ఇప్పటివరకు ఎంతోమంది టాప్ స్టార్స్ తో ఎపిసోడ్స్ ని పూర్తి చేసిన ఈ బిగ్గెస్ట్ టాక్ షో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పేరిట తెగ ప్రొమోషన్స్ చేసింది.
అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసారు.. ప్రోమోలు కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగించే విధంగా కట్ చేసారు.. అంతే కాకుండా నిన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాకముందే ప్రసాద్ లాబ్స్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక షో వేశారు.. దీనికి ప్రత్యేకంగా టిక్కెట్లు కూడా పెట్టారు.. ఒక టాక్ షో కి స్పెషల్ స్క్రీనింగ్ జరగడం ఇండియాలో ఇదే తొలిసారి.
అలా భారీ అంచనాల నడుమ ఈ ఎపిసోడ్ ని నిన్న రాత్రి 9 గంటలకు ఆహా యాప్ లో అప్లోడ్ చేసారు.. ట్రాఫిక్ ఒక రేంజ్ లో వస్తుందని అంచనా వేసిన ఆహా మీడియా టీం కేవలం ఈ ఎపిసోడ్ కోసం సర్వర్ సైజు పెంచారు.. అది కూడా సరిపోదేమో అని మరో మూడు బ్యాకప్ సర్వర్స్ ని కూడా సిద్ధంగా పెట్టుకున్నారు.. అంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయింది.
5 సార్లు యాప్ క్రాష్ అయ్యింది.. మొత్తం మీద 24 గంటలకు గాను 150 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఆహా మీడియా వాళ్ళు చెప్తున్నారు.. ఇది ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డు అట.. గతంలో ప్రభాస్ ఎపిసోడ్ కి 48 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి..కానీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి కేవలం 14 గంటల్లోనే 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి..ఇలా పవర్ స్టార్ ఎపిసోడ్ ఆహా మీడియా లో సంచలనం సృష్టించింది.
https://www.youtube.com/watch?v=g8lf5PCFLHY