Unstoppable With Nbk: ఇటీవలే విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే..ఆహా మీడియా లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఏకైక ఎపిసోడ్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది.రికార్డ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ , కంటెంట్ లో పెద్దగా దమ్ము లేకపోవడం అభిమానులను కాస్త నిరాశపరిచింది.పవన్ ఫ్యాన్స్ కి ప్రస్తుతం రాజకీయాల మీదనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.

మొదటి ఎపిసోడ్ లో రాజకీయాల గురించి ఏమి లేకపోవడం కాస్త నిరుత్సాహానికి గురి చేసినప్పటికీ రెండవ భాగం మాత్రం మొత్తం రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలతోనే నిండిపోయిందని మొన్న విడుదల చేసిన ప్రోమో తోనే అర్థం అయ్యింది..ఈరోజు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా , చిన్న గ్లిమ్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేసింది ఆహా టీం..ఈ గ్లిమ్స్ వీడియో లో డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య తో చేసిన సరదా హైలైట్ గా మారింది.
ముందుగా క్రిష్ రాగానే బాలయ్య బాబు ఒక ప్రశ్న అడుగుతూ ‘నువ్వు నాతో పని చేసావ్..పవన్ కళ్యాణ్ తో పని చేసావ్..ఇద్దరి మధ్య తేడా ఏమిటి’ అని అడుగుతాడు, అప్పుడు క్రిష్ ‘ఒక పులి సింహం మధ్య నా తల పెట్టారు, త్రివిక్రమ్ గారు ఎందుకు తప్పించుకున్నాడో ఇప్పుడు అర్థం అవుతుంది’ అని అంటాడు..ఆ తర్వాత క్రిష్ బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ‘మీలో కథ చెప్తున్నప్పుడు నిద్ర పోయింది ఎవరు’ అని అడుగుతాడు.

అప్పుడు పవన్ కళ్యాణ్ నవ్వుకుంటూ నేనే అని ముందుకు వస్తాడు, ఆ తర్వాత క్రిష్ మీలో ఫుల్ బాటిల్ లేపేసింది ఎవరు అని అడగగానే బాలయ్య సీరియస్ లుక్ ఇస్తాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చూడాలంటే కొద్దీ సేపు ఆగాల్సిందే, అంత వరకు క్రింద ఉన్న ఈ గ్లిమ్స్ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యండి.
https://www.youtube.com/watch?v=pgMIaNeiK9Y