Murali Mohan: ఆ రోజుల్లో అంటే.. ఏభై ఏళ్ల క్రితం.. సినిమాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం. ఫొటో ఆల్బమ్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాలి. తిరిగినా ఛాన్స్ లు వస్తాయని నమ్మకం లేదు. అయితే, ఏ కష్టం లేకుండా మురళీమోహన్ గారికి ‘జగమే మాయ’ అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో విలన్ గా గిరిబాబు గారు నటించారు.

ఇద్దరికీ అది మొదటి సినిమా. సినిమా రిలీజ్ అయ్యాక, గిరిబాబు విలన్ గా బాగా నటించాడనే పేరు ఆ నోటా ఈ నోటా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరిగింది. దాంతో గిరిబాబుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ, మురళీమోహన్ గారికి మాత్రం మరో సినిమా రాలేదు. ఇక చేసేది ఏమి లేక ఆయన తిరిగి విజయవాడ వచ్చేశారు.
అప్పట్లో ఆయన విజయవాడలో బిజినెస్ చేస్తూ ఉండేవారు. అయితే, హీరోగా చేసి ఇంటికి వచ్చాక, ఆయన కాస్త మానసికంగా వీక్ గా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది, రోజూ ఏదో ఒక రిపేరు వస్తుండేది. అసలుకే చికాకు ఉన్న మురళీమోహన్ కోపంతో ఆ బైక్ ను అమ్మేశారు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా వెటకారంగా నవ్వుతూ ఆయన ముందే రకరకాల కామెంట్స్ చేసేవారట.
Also Read: Unstoppable Show: బాలయ్య ‘షో’కి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ !
‘మోటార్ సైకిలు అమ్ముకుని సినిమాలో నటించాడురా’ అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలు మురళీమోహన్ గారిని చాలా బాధ పెట్టేవి. ఎందుకంటే సినిమాల్లో వేషం కోసం ఆయనెప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. గౌరవంగా పిలిచి వేషం ఇస్తేనే.. ఆయన వెళ్లి నిజాయతీగా కష్టపడి నటించి వచ్చారు. కానీ ‘రాజబాబు’ అప్పట్లో మురళీమోహన్ గారిని ఇలా పిలిచేవారు. రాజబాబు తెర పై బాగా ఆనుతున్నాడులే గానీ, బిగిసిపోయి మాట్లాడుతున్నాడు.
ఆడు హీరో ఏమిట్రా ఛీ’ అంటూ మరికొందరు ఇలా ఎన్నో రకాల అవమానాలు. అసలు ఈ అవమానాలు ఏమిటి ? అందుకే, ఎలాగైనా హీరోగా నిలబడాలని ఆయనలో పట్టుదల పెరిగింది. మళ్లీ కసితో నటించాలని నిర్ణయించుకున్నారు. మద్రాసు వైపు పయనం సాగించారు. చివరకు హీరోగా నిలబడ్డారు. అలాగే పెద్ద బిజినెస్ మెన్ గా ఎదిగారు.
Also Read: Akhanda Release: ‘అఖండ’ రిలీజ్ కి ముందే హైకోర్టు నిర్ణయం తీసుకుని ఉండుంటే ?