Homeఅప్పటి ముచ్చట్లు‘చిరంజీవి' అందుకే పేరు మార్చుకున్నారు !

‘చిరంజీవి’ అందుకే పేరు మార్చుకున్నారు !

Megastar Chiranjeevi‘మెగాస్టార్ చిరంజీవి’.. తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మకుటం లేని రారాజు. తన అభినయంతో, డ్యాన్స్ లతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన చిరంజీవి 1955వ సంవత్సరంలో ఆగష్టు 22వ తేదీన వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మొగల్తూరులో జన్మించాడు. అందరి లాగే సినిమాల్లో అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.

వేషాల కోసం తిరుగుతున్న చిరంజీవికి ‘పునాదిరాళ్ళు’ రూపంలో అవకాశం వచ్చింది. అప్పటి వరకూ అందరూ కొణిదెల శివ‌శంక‌ర వ‌ర ప్ర‌సాద్ అని పిలిచే వారు. కానీ మొదటి సినిమా చేస్తోన్న సమయంలో ఆంజనేయస్వామి గుడి మెట్ల పై కూర్చుని ఉన్నారు చిరు. అప్పుడే తనను ఎవరో వ్యక్తి ‘చిరంజీవి’ అని మొదటిసారి పిలిచారు. లేచి చూస్తే అది కల.

అలా వచ్చిన ఆ కల, ఆయనను చాల రోజులు వెంటాడింది. ఒక రోజు తనకు వచ్చిన ఆ కల గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పారు చిరు. ‘చిరంజీవి’ అనేది ఆంజనేయస్వామికి మారు పేరు, నువ్వు సినిమా తెర పై ఆ పేరే పెట్టుకోరా అంటూ ఆమె సలహా ఇచ్చారు. అప్పటికే ‘పునాది రాళ్లు’ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

నిర్మాతలు పునాది రాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లోనే మొదటిసారి చిరు తన పేరుని చిరంజీవి అని అధికారికంగా ప్రకటించారు. అలా చిరంజీవిగా తెలుగు చలనచిత్ర రంగానికి మెగాస్టార్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాధించుకున్నారు. పైగా ‘పునాది రాళ్ళు’ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానానికి గొప్ప పునాది పడింది.

అయితే, ‘పునాదిరాళ్ళు’ సినిమా కంటే ముందే.. ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలై.. చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ‘మన వూరి పాండవులు’ అనే సినిమా చిరుకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నటుడిగా ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కినా.. చిరంజీవిని స్టార్ ను చేసింది మాత్రం ‘ఖైదీ’ సినిమానే. ప్రభంజనాన్ని సృష్టించిన ఖైదీ కారణంగానే చిరంజీవి కాస్త మెగాస్టార్ అయ్యారు. ఇప్పటికీ మెగాస్టార్ గానే కొనసాగుతున్నారు.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version