Unknown Facts About Basil Joseph: మలయాళం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్న ఏకైక నటుడు బాసిల్ జోసఫ్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…స్టార్ హీరోలందరు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే బాసిల్ జోసఫ్ (Basil Joseph) లాంటి నటుడు మాత్రం సంవత్సరానికి 4 నుంచి 5 సినిమాలు ఈజీగా చేసేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాలు ఓటిటి లో తెలుగులో కూడా అవలెబుల్ లో ఉండడంతో తెలుగు ప్రేక్షకులు సైతం అతని సినిమాలను చూసి ఆయన్ని ఆదరిస్తున్నారు. దాంతో ఆయనకి తెలుగు లో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా, హీరోగా వైవిధ్యభరితమైన పాత్రులను పోషించగలిగే విలక్షణమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఈయన కాలేజీ రోజుల నుంచే షార్ట్ ఫిలిమ్స్ లను చేస్తూ తనకంటూ ఒక మంచి ఐడెంటిటిని సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇన్ఫోసిస్ లో సిస్టమ్ ఇంజినీర్ గా పని చేస్తూనే తనకి జీతంగా వచ్చిన డబ్బులను కూడబెట్టుకొని షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు…మొదట్లో ఆయా షార్ట్ ఫిల్మ్స్ ను ఎవరు పట్టించుకునేవారు కాదట…చాలా మంది డీ గ్రేడ్ చేస్తూ మాట్లాడేవారట… అయిన కూడా ఆయన సినిమా కూడా ఉన్న ఇంట్రెస్ట్ మంచి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తూ వచ్చాడు. ఆయన చెందిన ఒక షార్ట్ ఫిలిం అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడంతో మలయాళం ఇండస్ట్రీ అతన్ని అక్కున చేర్చుకుంది. నిజానికి ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళం ఇండస్ట్రీ లో ఉన్న దర్శక నిర్మాతలు టాలెంట్ ఉన్నవాళ్లను గుర్తించి వాళ్లకి మంచి అవకాశాలను ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. 2013 లో వచ్చిన తేర సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేస్తూనే మరో పక్క సినిమాలో నటించాడు… ఇక చాలా తక్కువ ఏజ్ లోనే అటు దర్శకుడిగా ఇటు నటుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. 2021 వ సంవత్సరంలో టివినో థామస్ ను హీరోగా పెట్టి ఆయన చేసిన మృణాల్ మురళి సినిమా మంచి విజయాన్ని సాధించింది…
ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించి అతనికి ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక ఈయన బాసిల్ ఎలిజబెత్ శ్యాముల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి హోప్ ఎలిజబెత్ బాసిల్ అనే కుమార్తె కూడా ఉంది…
ప్రస్తుతం నటుడిగా గా రాణిస్తున్న ఈయన మరోసారి దర్శకత్వ బాధ్యతలను చేపట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న సూర్యకి ఒక కథనైతే వినిపించారట. ఆయన ఆ కథ విని మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరి బాసిల్ జోసఫ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది…ఈ సినిమాతో పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అతను కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య(Surya) వెంకీ అట్లూరి (Venky Atluri) తో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాస్ జోసఫ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…