Varsha Bollamma: యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మకు మండింది. తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. ఈ క్రమంలో సంచలన ట్వీట్ చేసింది. విషయంలోకి వెళితే… వర్ష బొల్లమ్మ పెళ్ళికి సిద్దమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని వర్ష బొల్లమ్మ ప్రేమించారట. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట. ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పడం, వాళ్ళు అంగీకరించడం కూడా జరిగిపోగా.. మిగిలింది వివాహమే అనేది మీడియా కథనాల సారాంశం. ఈ కథనాలపై వర్ష బొల్లమ్మ నేరుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన సమాధానం తెలియజేశారు.

మీడియా కథనాలను ఉద్దేశిస్తూ సెటైరికల్ కామెంట్ చేశారు. నాకోసం నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి, అబ్బాయిని ఎంపిక చేసి పెళ్లి నిర్ణయించారు. ఆ అబ్బాయి ఎవరో నాకు కూడా చెప్పండి. ఎందుకంటే మా పేరెంట్స్ తో చెప్పాలి. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహా లో స్వాతి ముత్యం మూవీ చూడండి, అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. నాకే తెలియని నా లవర్ పెళ్లి కొడుకు ఎవడ్రా బాబు, అని అర్థం వచ్చేలా వర్ష బొల్లమ్మ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . అదే సమయంలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చిపారేశారు.
ఇక తెలుగులో వర్షకు మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి పేరు తెచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ థియేటర్స్ లో విడుదల చేసి ఉంటే కెరీర్ కి ప్లస్ అయ్యేది. ఆమె లేటెస్ట్ రిలీజ్ స్వాతిముత్యం సైతం పాజిటివ్ టాక్ అందుకుంది. కాకపోతే పెద్ద చిత్రాల మధ్య నలిగిపోయింది.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన స్వాతిముత్యం చిత్రంతో బెల్లంకొండ సురేష్ కుమారుడు గణేష్ హీరోగా పరిచయమయ్యాడు. 2015లో విడుదలైన తమిళ చిత్రం సాతురన్ తో వర్ష సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్-అట్లీ కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ బిగిల్ మూవీలో వర్ష బొల్లమ్మ ఫుట్ బాల్ ప్లేయర్ రోల్ చేశారు. ఆమె మూవీ వర్షకు కొంత గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.
Naakosam naake theliyakunda Pelli choopulu Chesi oka abbayi ni select chesinanduku anni websites ki thank you 🙏🏻 Aa abbayi evaru ani naaku chepthe, nen kuda maa inti vaallaki cheppestha:)
Prasthuthaniki naa Pelli choopulu choodalante, AHA lo swathimuthyam choodandi. #FAKENEWS pic.twitter.com/luLdwelMVk— Varsha Bollamma (@VarshaBollamma) October 28, 2022