Umar Sandhu- Malaika Arora: ఆమె శృంగారం లేకుండా ఉండదు.. మలైకా అరోరా గురించి సంచలన కామెంట్లు

49 ఏళ్ల అరోరా తన హాట్ ఫొటోలతో దడపుట్టిస్తోంది. ఎమ్ టీవీ హోస్టుగా జీవితం ప్రారంభించిన అరోరా తరువాత మోడలింగ్ రంగంలోకి మారింది. తన అందాలతో పాపులారిటీ సంపాదించుకుంది.

Written By: Srinivas, Updated On : May 8, 2023 9:04 am
Follow us on

Umar Sandhu- Malaika Arora: చల్ చయ్య చయ్య చయ్య అనే పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించిన హీరోయిన్ మలైకా అరోరా. తెలుగులో కూడా కెవ్వు కేక అంటూ తనదైన శైలిలో కుర్రకారును రెచ్చగొట్టింది. రాత్రయిన నాకు ఓకే పగలయిన నాకు ఓకే అంటూ మహేశ్ బాబును సైతం ఊరడించింది. ఇలా తన అందాలతో అందరిని అలరించింది. ఇంకా మున్నీ బదనాం హుయీ అంటూ ఆకట్టుకుంది. ఇలా మలైకా అరోరా తన ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు దాటింది.

49 ఏళ్ల అరోరా తన హాట్ ఫొటోలతో దడపుట్టిస్తోంది. ఎమ్ టీవీ హోస్టుగా జీవితం ప్రారంభించిన అరోరా తరువాత మోడలింగ్ రంగంలోకి మారింది. తన అందాలతో పాపులారిటీ సంపాదించుకుంది. తన గ్లామర్ తో చిత్ర రంగంలోకి కూడా దూసుకెళ్లింది. సినిమాల పరంగా ఆమెకు క్రేజీ రాకపోయినా కెరీర్ ను మాత్రం కొనసాగించింది. తన డ్యాన్సులతో అలరించింది.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ ను పెళ్లాడి ఓ కొడుకుకు జన్మనిచ్చింది. అభిప్రాయ భేదాలతో అతడికి దూరంగా ఉంటోంది. ఇదే సందర్భంలో తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ కొనసాగిస్తుందని సినీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె సీక్రెట్ గా అర్జున్ కపూర్ తో హాలీడే ట్రిప్పులకు వెళ్తోంది. అతడితో కలిసి తిరుగుతోంది.

మలైకా అరోరా జిమ్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను షేర్ చేస్తూ సినీ క్రిటిక్ గా భావించే ఉమర్ సంధు ఆసక్తికర కామెంట్లు చేశాడు. మలైకా అరోరా అర్ఫాజ్ ఖాన్ ను వదిలేసినా అర్జున్ కపూర్ తో చనువుగా ఉంటోంది. ఆమె శృంగారం లేకుండా ఉండలేదు. అందుకే అర్జున్ కపూర్ తో కలిసి ఉంటోందని ఆసక్తికర కామెంట్లు చేయడం గమనార్హం.