Ugram movie : అప్పుడే OTT లోకి ‘ఉగ్రం’.. విడుదల తేదీ ఎప్పుడంటే!

Ugram movie : అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాని నచ్చగా, మరికొంత మంది ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాలేదని అంటున్నారు. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో అల్లరి చేసే యాక్టీవ్ సన్నివేశానికి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. స్టార్ హీరోలకు కూడా […]

Written By: NARESH, Updated On : May 8, 2023 8:27 pm
Follow us on

Ugram movie : అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాని నచ్చగా, మరికొంత మంది ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాలేదని అంటున్నారు. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో అల్లరి చేసే యాక్టీవ్ సన్నివేశానికి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

స్టార్ హీరోలకు కూడా ఈమధ్య కాలం లో ఇలాంటి యాక్షన్ సన్నివేశం పడలేదని చూసి ప్రతీ ఒక్కరు చెప్తున్న మాట. మూడు రోజుల్లో రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నాల్గవ ఈరోజు కూడా స్టడీ వసూళ్లను నమోదు చేసుకుంది.ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకుంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ మంచి రేట్ కి కొనుగోలు చేసింది, అల్లరి నరేష్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ రేట్ కి అమ్ముడుపోయినట్టు టాక్.ఈ సినిమాని మే 25 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే ఆలోచన లో ఉన్నారట దర్శక నిర్మాతలు. అనుకున్న తేదీ కంటే ముందుగా విడుదల చేస్తే భారీ మొత్తం లో డబ్బులు ఇస్తామని ముందుకు రావడం తో మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

దీనితో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లో వచ్చినప్పుడు చూద్దాం అని అనుకున్నవాళ్లకు ఇది శుభ వార్త అనే చెప్పాలి.ఎలాగో ఈ వారానికి మించి ఈ చిత్రం ఆడాడు అనే స్థితి లో ఉన్నారు ఫ్యాన్స్, థియేట్రికల్ పరంగా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ డీల్ కి ఒప్పుకొని మరికొంత డబ్బులను పోగు చేసుకున్నారు నిర్మాతలు.