Adipurush Trailer: జనసముద్రం గా మారిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ థియేటర్స్..ప్రభాస్ రేంజ్ అంటే ఇది!

గ్రాఫిక్స్ కార్టూన్ నెట్వర్క్ బొమ్మల్ని చూసిన విధంగా ఉంది అంటూ ట్రోల్ల్స్ వచ్చాయి. దాంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాని రీ వర్క్ చెయ్యడం కోసం జూన్ కి వాయిదా వేశారు.

Written By: Vicky, Updated On : May 8, 2023 7:03 pm

Adipurush Trailer

Follow us on

Adipurush Trailer: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సినిమాలలో సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘ఆది పురుష్’. ఈ సినిమా జూన్ 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు డైరెక్టర్ ఓం రౌత్ ఇది వరకే పలు సందర్భాలలో తెలిపాడు. సరికొత్త టెక్నాలజీ అవ్వడం, మొదట రిలీజ్ చేసిన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

గ్రాఫిక్స్ కార్టూన్ నెట్వర్క్ బొమ్మల్ని చూసిన విధంగా ఉంది అంటూ ట్రోల్ల్స్ వచ్చాయి. దాంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాని రీ వర్క్ చెయ్యడం కోసం జూన్ కి వాయిదా వేశారు. ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో విడుదల చేసింది మూవీ టీం.

అందులో హైదరాబాద్ లో ఉన్న మహేష్ బాబు ‘AMB సినిమాస్’ కూడా ఒకటి. అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ ని వెండితెర మీద చూడబోతున్నాము అనే అనందం లో ఉన్న ఫ్యాన్స్ AMB థియేటర్ కి పోటెత్తారు. ఒక మాస్ థియేటర్ లో ఎలా అయితే ఎగబడుతామో, అదే రేంజ్ లో ఇంత అందమైన మల్టిప్లెక్స్ లో ఎగబడ్డారు ఫ్యాన్స్. దీనితో అభిమానుల తాకిడి ని కంట్రోల్ చెయ్యడానికి AMB స్టాఫ్ కి చాలా సమయమే పట్టింది.ఒక్క మాటలో చెప్పాలంటే స్టాఫ్ కి చుక్కలు చూపించేసారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఇక ఈ ట్రైలర్ కి అభిమానుల నుండే కాదు, ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదల సమయం లో ఈ చిత్రానికి వచ్చిన నెగటివిటీ మొత్తం ట్రైలర్ దెబ్బకి పోయిందని, రేపటి ఆన్లైన్ లో విడుదల అవ్వబోతున్న ఈ ట్రైలర్ ని చూసే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి కూడా అలంటి అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు, చూడాలి మరి.