Ugram Collections: అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకుంది. కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉండడం వల్ల ఈ చిత్రం ఫలితం అనుకున్న స్థాయిలో రాలేదని, ఎడిటింగ్ వర్క్ పర్ఫెక్ట్ గా చేసి ఉంటే కచ్చితంగా ఈ చిత్రం సమ్మర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడడమే కాకుండా, అల్లరి నరేశ్ ని మాస్ హీరో గా నిలబెట్టే ఛాన్స్ ఉండేదని, డైరెక్టర్ ఈ ఎడిటింగ్ విషయం కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుండేదని చెప్తున్నారు విశ్లేషకులు. కానీ ఈ సినిమాకి ఎక్కడా కూడా డిజాస్టర్ టాక్ అయితే రాలేదు కానీ, ఓపెనింగ్స్ మాత్రం డిజాస్టర్ రేంజ్ లోనే వచ్చాయి. టీజర్ మరియు ట్రైలర్ బాగుండడం వల్ల మార్నింగ్ షోస్ డీసెంట్ గానే ప్రారంభం అయ్యాయి.
కానీ మ్యాట్నీస్ నుండి మాత్రం వసూళ్లు అన్నీ ప్రాంతాలలో దారుణంగా పడిపోయాయి.ఫ్లాప్ టాక్ లేకపోయినా ఇలాంటి ఓపెనింగ్ దక్కడానికి కారణం, అల్లరి నరేష్ ని జనాలు మాస్ హీరోగా చూసేందుకు సిద్ధం అవ్వలేదని అర్థం అవుతుంది.ఈ చిత్రం లో ఆయన చాలా కష్టపడి ఫైట్స్ చేసాడు, డైలాగ్స్ కూడా బాగా చెప్పాడు,అయినా కానీ జనాలు ఇంకా అల్లరి నరేష్ మాస్ అలవాటు పడలేదు.
అయితే ఈ చిత్రం మొదటి రోజు అన్నీ ప్రాంతాలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగింది. వీకెండ్ కి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టగలదు,సోమవారం నుండి డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.