Manasantha Nuvve Re Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. స్టార్ హీరోలకు మాత్రమే ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. నిజానికి సక్సెస్ ఫుల్ హీరోలకు మాత్రమే ఇక్కడ గొప్ప క్రేజ్ దక్కుతుంది. ఒకప్పుడు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లను అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే…మనసంతా నువ్వే సినిమా రిలీజై 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ అల్లుడు తేజ ఒక వీడియోని రిలీజ్ చేశాడు.
మనసంతా నువ్వే సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అని, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తనకు ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుందని అందులో మామయ్య అద్భుతమైన నటనని కనబరిచాడు అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి రిలీజ్ లో సైతం ఈ మూవీని సూపర్ సక్సెస్ చేయాలని అతను కోరుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది… ఇక ఈ క్రమంలోనే కొంతమంది ఉదయ్ కిరణ్ అభిమానులు సైతం ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో లేకపోవడాన్ని గుర్తుచేసుకొని తీవ్రంగా బాధపడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఉదయ్ కిరణ్ చేసిన పని మాత్రం చాలా తప్పని ఆయన అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏదో ఒక రకంగా కష్టపడుతుంటే తనకు ఏదో ఒక మంచి క్యారెక్టర్ దొరికేదని తద్వారా తను ఇండస్ట్రీలో మళ్ళీ సర్వైవల్ అయ్యేవాడని తొందరపడి నిర్ణయం తీసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ అతన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు…
#ManasanthaNuvve 25 ఇయర్స్ & రి రిలీజ్ సందర్భంగా #UdayKiran మేనల్లుడు #Teja వీడియో బైట్
ఫిబ్రవరి 14న మళ్ళీ థియేటర్స్ లో ❤️#ManasanthaNuvve4K pic.twitter.com/NZxuDaNUk4
— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 9, 2026