Homeఎంటర్టైన్మెంట్Uday Kiran And Reema Sen: ఉదయ్ కిరణ్, రీమాసేన్, విశాల్ మధ్య ట్రయాంగిల్ లవ్...

Uday Kiran And Reema Sen: ఉదయ్ కిరణ్, రీమాసేన్, విశాల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందా..? ఇందులో విలన్ ఎవరంటే..?

Uday Kiran And Reema Sen: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇక తరచుగా వాళ్ళు మాట్లాడుతూ ఉండడంవల్ల ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోలు వాళ్లతో సినిమాలు చేసిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు… నిజానికి ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఎవరు చెప్పలేరు. ఏది ఏమైనా కూడా ఒకప్పటి స్టార్ హీరో అయిన ఉదయ్ కిరణ్ ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’ అనే రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి…

ఇక మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోవడంతో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక అలాంటి సందర్భంలోనే రీమాసేన్ సైతం తమిళంలో విశాల్ హీరోగా చేసిన చదరంగం, పొగరు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇదే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించిందనే వార్తలైతే వచ్చాయి. నిజానికి మనసంతా నువ్వే సినిమా సమయంలో రీమాసేన్ ఉదయ్ కిరణ్ ని ప్రేమించిందట…

కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఆమెని ఫ్రెండ్ గానే చూశాడు. ఆ తర్వాత విశాల్ తో రీమాసేన్ సినిమాలు చేసినపుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించిందని, కానీ విశాల్ పెళ్లి చేసుకోవడం కుదరదు. లివింగ్ రిలేషన్లో ఉందామని చెప్పడంతో ఆమె అతని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదట. వీళ్లకు సంబంధించిన వార్తలు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆ తర్వాత రీమాసేన్ ఒక బిజినెస్ మేన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది… మొత్తానికైతే అప్పట్లో జరిగిన వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు… మరి ఇందులో విలన్ ఎవరు అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం…కానీ పరిస్థితులను బట్టే ఎవరికి వాళ్లు వాళ్ళ కెరియర్ ని ఎంచుకుంటూ ముందుకు సాగుతారనేది వాస్తవం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version