Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్ ఆ ముగ్గురు డైరెక్టర్స్ తో సినిమా చేయడానికే ఇండస్ట్రీ కి వచ్చాడా..? ఇంతకీ...

NTR: ఎన్టీఆర్ ఆ ముగ్గురు డైరెక్టర్స్ తో సినిమా చేయడానికే ఇండస్ట్రీ కి వచ్చాడా..? ఇంతకీ వాళ్లెవరంటే..?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా వాళ్ళ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ జనరేషన్ లో నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళుతున్నాడనేది వాస్తవం. అయితే ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన ఒక ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట… అందులో మణిరత్నం ఒకరు కాగా, రాఘవేంద్రరావు మరొకరు కావడం విశేషం…ఇక ఇంకొకరు సింగీతం శ్రీనివాసరావు అంటూ అతను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు దర్శకులు లెజెండరీ డైరెక్టర్లుగా పేర్లను సంపాదించుకున్నారు. కానీ దురదృష్టం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురిలో ఎవరితో కూడా సినిమా చేయకపోవడం అతనితో పాటు అతని అభిమానులను కూడా బాధిస్తుంది. అయితే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాకి రాజమౌళి డైరెక్షన్ చేసినప్పటికి రాఘవేంద్రరావు దానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు.

కాబట్టి ఒక రకంగా రాఘవేంద్రరావు అండర్ లో ఆయన ఒక సినిమా చేశాడు. కాబట్టి అదొక సంతృప్తిని ఇచ్చిందంటూ ఆయన గతంలో తెలియజేశాడు. కానీ మణిరత్నం, సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో మాత్రం ఇప్పటివరకు తను సినిమా చేయలేదు… నిజానికి మణిరత్నం, సింగీతం శ్రీనివాసరావు సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి.

రెగ్యులర్ పాటర్న్ లో వాళ్ళు సినిమాలను చేయరు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంటారు. కాబట్టి ప్రేక్షకులను కూడా ఎప్పటికప్పుడు కొత్త జానర్ లోకి తీసుకెళ్తుంటారు. ఇక అప్పుడున్న ఎన్టీఆర్ మైండ్ సెట్ కి వాళ్లతో సినిమాలు చేస్తే తను కూడా టాప్ రేంజ్ లోకి వెళ్లొచ్చు అనే ఒక ఆలోచనతో ఉన్నాడట…

మొత్తానికైతే ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version