Tyson Naidu: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ టైసన్ నాయుడు. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా టైసన్ నాయుడు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. నిమిషానికి పైగా నిడివి ఉన్న గ్లింప్స్ పరిశీలిస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రాల మాదిరి యాక్షన్ డోస్ ఓ రేంజ్ లో ఉంది.
అసలు టైటిల్ చాలా కొత్తగా ఉంది. టైసన్ నాయుడు అని పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. మరొక విశేషం ఏమిటంటే.. టైసన్ నాయుడు చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రోల్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీకి దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర టైసన్ నాయుడు చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ ని సాగర్ కే చంద్ర ప్రజెంట్ చేసిన తీరు మెప్పించింది. ఇక మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి.
మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ లేక అల్లాడుతున్నారు. ఆయన గత రెండు చిత్రాలు అల్లుడు అదుర్స్, ఛత్రపతి హిందీ డిజాస్టర్స్ అయ్యాయి. జయ జానకి నాయక మూవీ యావరేజ్ గా ఆడింది. తర్వాత ఆయన నటించిన ఒక్క చిత్రం కనీస వసూళ్ళు రాబట్టలేదు. ఎప్పుడో వచ్చిన ప్రభాస్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి పరువుపోగొట్టుకున్నాడు. వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ కావాలి…
