Verify Websites : అసలు వెబ్ సైట్లు ఏవీ.. తప్పుడివి ఏవీ.. ఈ ఒక్క యాప్ తో తెలుసుకోవచ్చు

మన మొబైల్‌కు వచ్చిన వెబ్‌సైట్‌ ఐడీని పేస్ట్‌ చేయాలి. అనంతరం సెర్చ్‌ కొడితే ఈ యాప్‌ లో సెర్చ్‌ చేస్తే ఆ వైబ్‌పైట్‌ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చిందా.. లేదా అనేది తెలిసిపోతుంది.

Written By: NARESH, Updated On : January 3, 2024 7:58 pm
Follow us on

Verify Websites : సైబర్‌ మోసాలు పెరుగుతున్న వేళ ఓ యువకుడు.. ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టాడు. వినూత్న ఆవిష్కరణకు తెరతీశాడు. తన మెయిల్‌కు వచ్చిన మెస్సేజ్‌తో తాను మోసపోయినట్లు ఇంకా ఎవరూ మోసపోవద్దని ఓ ఆవిష్కరణకు రూపకల్పన చేశాడు. ‘వె రిఫైయూఆర్‌ఎల్‌’ (verify URL) పేరిట యాప్‌ రూపొందించి ఆరు వేలకుపైగా అధికారిక అఫీషియల్ వెబ్‌సైట్‌ అడ్రస్‌ల జాబితా తయారు చేశాడు. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రముఖ షాపింగ్‌ మాల్లు, ఇతర కంపెనీల వైబ్‌పైట్లు ఇందులో ఉన్నాయి. వీటి ఆధారంగా మొబైల్‌కు వచ్చే వెబ్‌ సైట్‌ అడ్రస్‌లను ఈ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఓ యువకుడు రూపొందించిన ఈ యాప్‌ను వినియోగిస్తున్న పలువురు అభినందిస్తున్నారు.

తనలా మోస పోవద్దని..
ఆన్‌లైన్‌ మోసాల బారిన పడిన కడియాల గోపి 2010లో కొత్తగూడెం మైనింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఫైనల్‌ ఇయర్‌ లో ఉండగా మెయిల్‌కు ‘రూ.కోటి లాటరీ తగిలింది.. మీరు రూ.25 వేలు చెల్లిస్తే డబ్బులు మీ ఖాతాలో పడుతాయి’ అంటూ వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. మెయిల్‌ పంపిన వ్యక్తి బ్యాంకు ఖాతా నంబర్‌ తో పాటు ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వగా రూ.కోటి వస్తాయనే భావనతో గోపి రూ.25 వేలు ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్‌∙చేస్తే డబ్బు తీసుకునేందుకు ముంబై రావాలని సూచించాడు. గోపీ ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గమనించాడు. తనలా ఎవరూ మోసపోవద్దనే భావనతో వెరిఫై యూఆర్‌ఎల్‌ (verify URL: Safe Link Checker)  యాప్‌కు రూపకల్పన చేశాడు.

ఐడీ అసలుదేనా..?
పండుగల ఆఫర్లు, ప్రత్యేక రోజుల్లో పలు కంపెనీల నుంచి సెల్‌ ఫన్‌లకు పలు వెబ్‌ సైట్లు మెస్సేజ్‌లు పంపించడం కామన్‌ అయింది. తెలిసీ తెలియక ఆయా వెబ్‌పైట్లను క్లిక్‌ చేస్తే ఖాతాల్లో ఉన్న డబ్బు కోల్పోయే ప్రమాదముంది. అంతేకాక పలువురు లాటరీ తగిలిందని, కొంత డబ్బు చెల్లించాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. వీటికి స్పందిస్తే లాటరీ మాటేమో కానీ మోసపోవడం జరుగుతోంది. దీంతో మన ఫోన్‌కు వచ్చిన కంపెనీ  అధికారిక వెబ్‌సైట్‌ ఫేక్‌ నా, కాదా తెలుసుకునేందుకు గోపీ రూపొందించిన ’వెరిఫై యూఆర్‌ఎల్‌’ యాప్‌ ఉపయోగపడుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి పొంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులే కాక ప్రముఖ షాపింగ్‌ మాళ్లు, పలు రాష్ట్రాల అధికార వైబ్‌సైట్లు 6 వేలకుపైగా అడ్రస్లు, ఐడీలను యాప్‌లో నిక్షిప్తం చేశాడు. మొబైల్‌ ప్లేస్టోర్‌కు వెళ్లి ‘వెరిఫైయూఆర్‌ఎల్‌’ యాప్‌ డౌన్‌∙లోడ్‌ చేసుకుని. అందులో మన మొబైల్‌కు వచ్చిన వెబ్‌సైట్‌ ఐడీని పేస్ట్‌ చేయాలి. అనంతరం సెర్చ్‌ కొడితే ఈ యాప్‌ లో సెర్చ్‌ చేస్తే ఆ వైబ్‌పైట్‌ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చిందా.. లేదా అనేది తెలిసిపోతుంది.